12న నేషనల్ స్పిరిట్ వాక్
భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానందుడిని ఆదర్శంగా తీసుకుని యువత పయనించాలని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు.
మన్సూరాబాద్, జనవరి 9: భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానందుడిని ఆదర్శంగా తీసుకుని యువత పయనించాలని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. స్వామి వివేకానందుడి 160వ జయంతిని పురస్కరించుకొని ఈనెల 12న బండ్లగూడలోని హిందూ అరణ్య నుంచి నిర్వహించనున్న నేషనల్ స్పిరిట్ వాక్-2023 పోస్టర్‌ను సోమవారం మన్సూరాబాద్ డివిజన్ పరిధి ఆటోనగర్‌లోని మహవీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్కులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డితో కలిసి ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గురువారం ఉదయం 5:30 గంటలకు నేషనల్ స్పిరిట్ వాక్-2023 నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. యువత, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, మహిళలు, సీనియర్ సిటిజన్స్ ఫోరం సభ్యులు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విజేందర్ రెడ్డి, సునీల్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీఎన్‌రెడ్డినగర్ డివిజన్లోని సచివాలయనగర్ కాలనీ నూతన సంక్షేమ సంఘం సభ్యులు, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు కుర్మారావు, ప్రధాన కార్యదర్శి హనుమంత్‌రావు, ఉపాధ్యక్షుడు సాంబశివరావు, రవికుమార్, ట్రెజరర్ గోపాల్‌రెడ్డి, స్పోర్ట్స్ సెక్రటరీ శ్రీధర్‌కుమార్, కల్చరల్ సెక్రటరీ బాల్‌రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ సూర్యనారాయణ, కార్యవర్గసభ్యులు రవి, ఆంజనేయులు, నర్సింహారెడ్డి, జనార్దన్‌రావు, సీతారామశాస్త్రి తదితరులు పాల్గొన్నారు.
– హయత్‌నగర్, జనవరి 9
విక్టోరియా మెమోరియల్ హోం మైదానంలో వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి జనవరి 12న నిర్వహించే వివేకానంద స్పిరిట్ వాక్ వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించిన బీఆర్ఎస్ గడ్డిఅన్నారం డివిజన్ అధ్యక్షుడు జక్కల శ్రీశైలం యాదవ్, నర్సింగ్ గౌడ్, కబీర్దాస్, చిత్రంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నర్సింగ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కబీర్దాస్ గౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బబ్బురి ఆనంద్‌కుమార్ గౌడ్, బేర బాలకిషన్, దుబ్బాక శశిధర్‌రెడ్డి, పార్శపు శ్రీధర్, కిరణ్, వెంకటేశ్వర్‌రెడ్డి, రామారావు, చంద్రారెడ్డి, సోమన్న గౌడ్, బుచ్చయ్య చౌదరి, సత్యనారాయణ, వేణు గౌడ్.
– ఎల్బీనగర్, జనవరి 9
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

