Narayana Schools | నారాయణ స్కూల్స్‌లో ‘మాస్టర్ ఒరేటర్ – సీజన్ 7’.. విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్, ఆత్మవిశ్వాసం పెంపునకు ప్రత్యేక కార్యక్రమం
Narayana Schools | విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా నారాయణ స్కూల్స్ ‘మాస్టర్ ఒరేటర్ కాంటెస్ట్ – సీజన్ 7’ను నిర్వహించింది. లైఫ్ స్కిల్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో పబ్లిక్ స్పీకింగ్, సమర్థవంతమైన కమ్యూనికేషన్, విమర్శనాత్మక ఆలోచన, ఆత్మవిశ్వాసం, భావ వ్యక్తీకరణ వంటి నైపుణ్యాలను పెంపొందించడంపై దృష్టి సారించారు.
Narayana Schools | విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా నారాయణ స్కూల్స్ ‘మాస్టర్ ఒరేటర్ కాంటెస్ట్ – సీజన్ 7’ను నిర్వహించింది. లైఫ్ స్కిల్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో పబ్లిక్ స్పీకింగ్, సమర్థవంతమైన కమ్యూనికేషన్, విమర్శనాత్మక ఆలోచన, ఆత్మవిశ్వాసం, భావ వ్యక్తీకరణ వంటి నైపుణ్యాలను పెంపొందించడంపై దృష్టి సారించారు.
ఈ పోటీని రెండు విభాగాల్లో నిర్వహించారు. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఒక విభాగం, 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు మరో విభాగంగా పోటీలు జరిగాయి. 1 నుంచి 5వ తరగతి విభాగంలో 2,600 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో 84 మంది ఫైనల్స్‌కు అర్హత సాధించారు. గ్రాండ్ ఫినాలేలో 18 మంది విద్యార్థులను విజేతలుగా గుర్తించారు. వీరిలో ఆరుగురు ప్రథమ, ఐదుగురు ద్వితీయ, ఏడుగురు తృతీయ స్థానాలు సాధించారు.
అదేవిధంగా 6 నుంచి 9వ తరగతి విభాగంలో ప్రాథమిక పోటీలకు 3,500 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోని 12 క్యాంపస్‌లకు చెందిన 96 మంది విద్యార్థులు ఫైనల్స్‌కు ఎంపికయ్యారు. ఈ విభాగంలో మొత్తం 34 మంది విద్యార్థులను విజేతలుగా గుర్తించారు. వీరిలో ఎనిమిది మంది ప్రథమ, 12 మంది ద్వితీయ, 14 మంది తృతీయ స్థానాలు సాధించారు. కంటెంట్, సృజనాత్మకత, ప్రెజెంటేషన్, కమ్యూనికేషన్ నైపుణ్యాల ఆధారంగా విద్యార్థుల ప్రతిభను అంచనా వేశారు.

Narayana Schools2
ఈ పోటీల్లో విద్య, సాంకేతికత, చరిత్ర, సృజనాత్మకత, ప్రపంచ అనుసంధానం వంటి విభిన్న అంశాలపై విద్యార్థులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ‘ఇంటర్నెట్ లేని జీవితం’, ‘పాఠ్యప్రణాళికలో కళలు, సంగీతం ప్రాముఖ్యత’, ‘మెరుగైన పాఠశాలపై నా దృష్టి’, ‘చిన్న చిన్న చర్యలతో పెద్ద మార్పులు సాధ్యం’, ‘ప్రపంచీకరణ.. మన ప్రపంచం ఎలా అనుసంధానమై ఉంది’ వంటి అంశాలపై ప్రసంగించారు.
ఈ పోటీ విద్యార్థులకు తమ ఆలోచనలను స్పష్టంగా తెలియజేయడానికి, వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించడానికి, సమకాలీన అంశాలపై చర్చించడానికి వేదికగా నిలిచింది. అలాగే పబ్లిక్ స్పీకింగ్, కమ్యూనికేషన్, వ్యక్తుల మధ్య పరస్పర సంబంధాల నైపుణ్యాలను పెంపొందించుకోవడంతో పాటు తమ అభిప్రాయాలను ఆత్మవిశ్వాసంతో వ్యక్తం చేసే సామర్థ్యాన్ని మెరుగుపరచుకునేందుకు దోహదపడింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Narayana Schools | నారాయణ స్కూల్స్‌లో ‘మాస్టర్ ఒరేటర్ – సీజన్ 7’.. విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్, ఆత్మవిశ్వాసం పెంపునకు ప్రత్యేక కార్యక్రమం
COVID New Variant | విస్తరిస్తున్న కొత్త కొవిడ్ వేరియంట్.. పలు దేశాల్లో పీజే.2.1 వ్యాప్తి
రైతులు పనిచేసేది 3 నెలలే.. మిగతా 9 నెలలు పేకాట, మద్యం తాగుతూ గడిపేస్తారు.. బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
Kazipet Land Scam | నాడు గూడు కల్పించింది కాంగ్రెస్సే.. నేడు కూల్చుతున్నది కూడా కాంగ్రెస్సే.. కాజీపేట భూమి అసలు కథ ఇదే
Dharma Deeksha | సర్కార్ ధోకాపై ఉద్యోగుల ఆగ్రహం.. ఈ నెల 17న రాష్ట్రవ్యాప్తంగా సామూహిక సెలవులు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

