ఉన్నాయి..కానీ పనిచేస్తున్నాయా?

- నోచుకోని నిఘా నేత్రాలు
- ఛేదనలో అవాంతరాలు
- స్థాయిలో వినియోగంలోకి తేవాలంటున్న స్థానికులు
గోల్నాక, నవంబర్ 26 : నేరాల నియంత్రణకు పోలీసు యంత్రాగం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఉన్నా ఉపయోగం లేకుండా పోతున్నాయి. నేరాల నియంత్రణకు దోహద పడే సీసీ కెమెరాల నిర్వహణలో అధికారులు అలసత్వం చేయడంతో నేరాల ఛేదనలో అవాంతరాలు ఏర్పాడుతున్నాయి. కొన్ని నెలలుగా అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చాలా వరకు సీసీ కెమెరాలు పనిచేయక అలంకార ప్రాయంగా మారాయి.
అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో..
అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతాపూర్, అంబర్‌పేట ప్రధాన రహదారినుంచి గోల్నాక చౌరస్తా, అంబర్‌పేట శ్రీరమణ చౌరస్తా నుంచి మూసారాంబాగ్, శివం రోడ్డు నుంచి ఛే నంబరు చౌరస్తా, అలాగే గోల్నాక చౌరస్తా నుంచి అలీకేఫ్ చౌరస్తా వరకు ప్రధాన రహదారుల్లో ఎంపీ, ఎమ్మెల్యే కోటా కింద ఏర్పాటు చేసిన మొత్తం 253 సీసీ కెమెరాల్లో ప్రస్తుతం 220 మాత్రమే పనిచేస్తున్నట్లు సమాచారం. పోలీసులు ప్రజల భాగస్వామ్యం లో బాగ్‌అంబర్‌పేట డీడీ కాలనీ, సీఈ కాలనీ, అంబర్‌పేట అనంతరాంనగర్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు మొత్తం 180 ఉండగా అందులో కేవలం 94 మాత్రమే పనిచేసున్నాయి. మిగిలినవి అలంకార ప్రాయంగా మారాయి.
నేరాల నియంత్రణలో జాప్యం..
గత కొద్ది నెలలుగా సీసీ కెమెరాలు పూర్తి స్థాయిలో పని చేయకపోవడంతో నేరాల నియంత్రణలో జాప్యం జరుగుతున్నట్లు తెలిసింది. ముఖ్యంగా దొంగతనాలు, వాహనాల దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు అందుకు బాధ్యులను వెంటనే గుర్తించేందుకు పోలీసులు ఇబ్బందులు పడక తప్పని పరిస్థితి. ఇక కొన్ని కెమెరాలు పనిచేస్తున్న అవి నాసిరకంగా ఉండడంతో వర్షం పడ్డా లేదా చీకటిగా ఉన్న అవి రికార్డు చేసిన పుటేజీలు స్పష్టంగా కనిపించడంలేదు. వీటి నిర్వహణ బాధ్యతను కెమెరాలు ఏర్పాటు చేసిన ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించారు. మరమ్మతులు భారాన్ని ఎవరు భరించాలో స్పష్టత లేక పోవడంతో ప్రైవేటు సంస్థ చేతులెత్తేసినట్లు సమాచారం.
సమస్యను వెంటనే పరిష్కరిస్తాం
ఇటీవల కురిసిన వర్షాలకు కొన్ని సీసీ కెమెరాలు పనిచేయడంలేదన్న విషయం మా దృష్టికి వచ్చింది. వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి పని చేయని కెమెరాలను గుర్తించి మరమ్మతులు చేయించి ఉపయోగంలోకి తెస్తాం.
- పి. సుధాకర్, ఇన్స్పెక్టర్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

