దోమల వ్యాప్తి నివారణ ప్రతి పౌరుని బాధ్యత
దోమల వ్యాప్తి నివారణ | దోమల వ్యాప్తి నివారణ ప్రతి పౌరుని బాధ్యత అని జీహెచ్ఎంసీ చీఫ్ ఎంటమాలజిస్ట్ డాక్టర్ రాంబాబు అన్నారు.

సిటీబ్యూరో, సెప్టెంబరు 5 (నమస్తే తెలంగాణ ) : దోమల వ్యాప్తి నివారణ ప్రతి పౌరుని బాధ్యత అని జీహెచ్ఎంసీ చీఫ్ ఎంటమాలజిస్ట్ డాక్టర్ రాంబాబు అన్నారు. దోమల రహిత నగరం కోసం కలిసి పోరాడుదాం అని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు కార్యక్రమంలో భాగంగా ఆదివారం 30 సర్కిళ్లలో దోమల నివారణ అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు.
150 డివిజన్లలో 150 కాలనీలలో సుమారు 45 వేల మంది ప్రజల సమక్షంలో స్టాల్స్ ఏర్పాటు చేసి దోమ గుడ్డు, లార్వా దశ నుంచి పెద్ద దోమ గా ఎలా మారుతుందో సెల్ఫోన్ వీడియోల ద్వారా, ఫ్లిప్ బుక్ ల ద్వారా ప్రత్యక్షంగా అవగాహన కల్పించినట్లు రాంబాబు చెప్పారు. 30 సరిళ్ల పరిధిలో ప్రతి ఒక ఎంటమాలజీ కార్మికుడు ఇంటింటికి తిరిగి నీరు నిల్వ ఉన్న ప్రదేశాలను గుర్తించి వాటిని ఒలకబోసి ఇంటి సభ్యులకు అవగాహన కల్పిస్తామన్నారు.
ఈ అవగాహన, ఆరోగ్య సదస్సులకు పార్లమెంట్ సభ్యులను, శాసనసభ్యులను, మేయర్, డిప్యూటీ మేయర్లను, ఎమ్మెల్సీలను, కార్పొరేటర్ లను, ప్రజా ప్రతినిధులను, విఐపిలను, జిహెచ్ఎంసి అధికారులను, కాలనీ సంక్షేమ సంఘ ప్రతినిధులను, పొదుపు సంఘాల మహిళా సభ్యులను భాగస్వామ్యం చేశామని వివరించారు.
కార్యక్రమాలలో ఆరు జోన్ల సీనియర్ ఎంటమాలజీస్ట్ లు, 30 సరిళ్ల అసిస్టెంట్ ఎంటమాలజీస్ట్ లు, 150 డివిజన్ల సూపర్ వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

