గాంధీ చరిత్రను వక్రీకరించే కుట్ర
జాతిపిత మహాత్మా గాంధీ చరిత్రను వక్రీకరించే కుట్ర జరుగుతున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ మరణంలో వాస్తవాలు నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉన్నదన్నారు. సోమవారం మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భ
- గాడ్సేను పొగడడం దేశాన్ని అవమానించడమే
- స్వాతంత్య్ర ఉద్యమంలో బీజేపీ పాత్ర ఏంటి?
- గాంధీ హత్యపై వాస్తవాలు నేటి తరానికి తెలియాలి
- ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్
హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): జాతిపిత మహాత్మా గాంధీ చరిత్రను వక్రీకరించే కుట్ర జరుగుతున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ మరణంలో వాస్తవాలు నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉన్నదన్నారు. సోమవారం మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మంత్రుల నివాస ప్రాంగణంలోని క్యాంప్ కార్యాలయంలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేను పొగుడుతూ బీజేపీ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం బాధాకరమన్నారు. ఇలా చేయడమంటే దేశాన్ని అవమానించడమేనని అన్నారు. మహాత్మా గాంధీ హత్య, వాస్తవ చరిత్రను బీజేపీ వక్రీకరిస్తున్నదని ఆరోపించారు. గాంధీ మరణంపై బీజేపీ సోషల్ మీడియా అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని, వాస్తవ చరిత్ర నేటి తరానికి తెలపాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని చెప్పారు.
ఈ విషయంలో ధైర్యంగా మాట్లాడాల్సిన అవసరం ఉన్నదని, లేకుంటే చెప్పుకున్నోడిదే చరిత్ర అవుతుందని పేరొన్నారు. మహాత్మా గాంధీ హత్యతో మతోన్మాద ఉగ్రవాదానికి బీజం పడిందని చెప్పారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన గాంధీని మహాత్మా అని పిలుచుకుంటున్నామని, స్వాతంత్య్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ స్ఫూర్తి గొప్ప మైలురాయని కొనియాడారు. అయితే, గాంధీని మహాత్మా అనే పేరుతో పిలవడానికి కూడా బీజేపీ నేతలు ఇష్టపడటం లేదన్నారు. స్వాతంత్య్ర పోరులో చురుగ్గా పాల్గొని తొమ్మిది సంవత్సరాల పాటు జైలు జీవితాన్ని గడిపిన జవహర్లాల్ నెహ్రూను కించపరుస్తూ, బీజేపీ దుష్ప్రచారం చేస్తున్నదని, ఇది విచారకమని తెలిపారు. బీజేపీ నేతలు ఎవరైనా స్వాతంత్య్ర ఉద్యమంలో ఒక్కరోజైనా పాల్గొన్నారా? అని ప్రశ్నించారు. అలాంటి వారు నెహ్రూను అవమానించడం, గొప్ప దేశభక్తి తమకే ఉన్నదని చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. ఈ పదేండ్ల కాలంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒక మంచి పనైనా చేసిందా అని నిలదీశారు. ఒక్క ఉక్కు పరిశ్రమనైనా స్థాపించారా? ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టునైనా కట్టారా? అని ప్రశ్నించారు.
ప్రభుత్వ రంగ సంస్థలే దేశానికి జీవనాడి అని, కానీ బీజేపీ వాటిని కూడా ప్రైవేటుకు కట్టబెడుతున్నదన్నారు. దేశ భక్తి అంటే ఇదేనా అని నిలదీశారు. ఈ కార్యక్రమంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి, భూదాన్ యజ్ఞ సంస్థ రాష్ట్ర నాయకులు యానాల ప్రభాకర్ రెడ్డి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అక్బర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Conspiracy
- defame
- gandhi
- Godse
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

