పట్టభద్రుడికి ఓటు హకు దకేనా
ఉమ్మడి మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గాల ఓటర్ల నమోదు ప్రక్రియ తీవ్ర గందరగోళం మధ్య సాగుతోంది. ఓటు హకు పొందేందుకు ఉత్సాహంగా ముందుకు వచ్చిన వేలాది మంది పట్టభద్రులకు ఎన్నికల సంఘం అధికారుల నిర్లక్ష్యం, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించే వైఖరి తీవ్ర నిరాశను కలిగిస్తోంది
-
5.56 లక్షల దరఖాస్తులు..79.19%
-
పెండింగ్ ఎమ్మెల్సీ ఓటరు నమోదులో ఎన్నికల సంఘం విఫలం
-
నెల రోజులు దాటినా.. అర్జీలకు దక్కని అనుమతి
-
అధికారుల పనితీరుపై గ్రాడ్యుయేట్ల ఆగ్రహం
సిటీబ్యూరో, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ) ఉమ్మడి మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గాల ఓటర్ల నమోదు ప్రక్రియ తీవ్ర గందరగోళం మధ్య సాగుతోంది. ఓటు హకు పొందేందుకు ఉత్సాహంగా ముందుకు వచ్చిన వేలాది మంది పట్టభద్రులకు ఎన్నికల సంఘం అధికారుల నిర్లక్ష్యం, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించే వైఖరి తీవ్ర నిరాశను కలిగిస్తోంది. ఈసారి భారీ ఎత్తున దరఖాస్తులు వెల్లువెత్తినప్పటికీ, వాటి పరిశీలన ప్రక్రియలో అధికారులు అనుసరిస్తున్న మందకోడి ధోరణి కారణంగా లక్షలాది దరఖాస్తులు మూలనపడ్డాయి. మొత్తంగా 5.56 లక్షల దరఖాస్తులు అందగా..అందులో 11 1321 మాత్రమే ఆమోదం తెలిపారు. 79.19 శాతం దరఖాస్తులు ఇంకా పరిష్కారానికి నోచుకోలేదు. పెండింగ్ దరఖాస్తుల్లో అత్యధికం బూత్ లెవల్ అధికారుల (బీఎల్వో) వద్దే నిలిచిపోయాయి. 64,330 దరఖాస్తుల ప్రాసెసింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. దరఖాస్తుల పరిశీలనలో క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు ప్రక్రియ వేగం పెరగాల్సిన అవసరాన్ని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
సిటీబ్యూరో, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ) : మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంలో పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉన్నది. అత్యధికంగా మేడ్చల్ మలాజిగిరి జిల్లాలో 1,17,319 రంగారెడ్డి జిల్లాలో 1,10660, హైదరాబాద్ జిల్లాలో 77529 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో మొత్తం 5,56,921 దరఖాస్తులు అందగా, కేవలం 113121 ఆమోదం పొందాయి. అంటే దాదాపు 79.19 శాతం దరఖాస్తులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఓటరు నమోదు గడువు ముగియడానికి ఒకరోజు మాత్రమే మిగిలిన సమయంలో ఇంత పెద్ద సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్లో ఉండటం ఎన్నికల నిర్వహణపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, 2021 గణాంకాలతో పోలిస్తే రెండు నియోజకవర్గాల్లో ఓటరు నమోదు సంఖ్యలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.
మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గంలో గతంతో పోలిస్తే దరఖాస్తులు తగ్గాయి. మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంలో నాడు 5,76,462 దరఖాస్తులు రాగా, ఇప్పుడు శుక్రవారం వరకు 5,56921 వచ్చాయి. అంటే సుమారు 20 వేల దరఖాస్తులు తగ్గాయి. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఓటు కీలకమైనది. అయితే, లక్షలాది దరఖాస్తులు పెండింగ్లో ఉండటంతో అర్హులైన ప్రతి పట్టభద్రుడికీ ఓటు హకు దకేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బీఎల్వోల వద్దే అత్యధిక దరఖాస్తులు నిలిచిపోవడానికి కారణాలేమిటి? క్షేత్రస్థాయి పరిశీలనకు తగినంత సిబ్బందిని నియమించారా? దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ఉన్నదా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. గడువులోగా దరఖాస్తులు సమర్పించిన అర్హులైన పట్టభద్రులెవరూ కేవలం అధికారుల జాప్యం కారణంగా ఓటు హకు కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల యంత్రాంగంపైనే ఉన్నది. నమోదు గడువు ముగుస్తున్నా.. కనీసం పరిశీలన కూడా పూర్తి కాకపోవడంతో అర్హులైన ప్రతిఒకరికీ ఓటు హకు దకుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకుని, దరఖాస్తుల పరిశీలనను వెంటనే పూర్తి చేయాలని పట్టభద్రులు డిమాండ్ చేస్తున్నారు.
మరో అవకాశం: ఆర్వీ కర్ణన్
ఓటరు నమోదు ప్రక్రియకు నవంబర్ 6 చివరి తేదీగా నిర్ణయించినప్పటికీ, ఆ తర్వాత కూడా అర్హులైన పట్టభద్రులు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ స్పష్టం చేశారు. నవంబర్ 25న ముసాయిదా ఓటరు జాబితా విడుదల కానున్నది. అదే రోజు నుంచి డిసెంబర్ 10 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్లు స్వీకరిస్తారు. డిసెంబర్ 30న తుది ఓటరు జాబితా ప్రచురిస్తారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ వరకు ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
మహబూబ్నగర్-రంగారెడ్డి, హైదరాబాద్ నియోజకవర్గంజిల్లా అందిన జిల్లా
జిల్లా మండలాలు దరఖాస్తులు ఆమోదం తిరసరణ పెండింగ్ (శాతంలో)
రంగారెడ్డి 27 1,41, 677 30046 971 110660 / 78.11
వికారాబాద్ 20 38208 8744 148 29316 /76.73
మేడ్చల్ మలాజిగిరి 15 131540 13881 340 117319/89.19
హైదరాబాద్ 16 92181 14370 282 77529/84.11
మహబూబ్నగర్ 17 42950 10110 234 32606/75.92
నాగర్ కర్నూల్ 20 41230 16593 502 24135/58.54
వనపర్తి 15 27784 6341 96 21347/76.83
జోగులాంబ గద్వాల 13 22086 6086 70 5930/72.13
నారాయణపేట 13 19265 6950 139 12176/63.20
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

