Rajasekhar Reddy | రిజిస్ట్రేషన్ల నిలిపివేత అప్రజాస్వామ్యం : ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి
Rajasekhar Reddy | రిజిస్ట్రేషన్ల నిలిపివేత అప్రజాస్వామ్యమని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని వక్ఫ్ బోర్డు భూములని(Waqf Board Lands) కొన్ని సర్వే నంబర్లలో రిజిస్ట్రేషన్లను నిలిపివేయడంలో ప్రజలలో గందరగోళం ఏర్పడిందన్నారు.
మల్కాజిగిరి, నవంబర్ 15: రిజిస్ట్రేషన్ల నిలిపివేత అప్రజాస్వామ్యమని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం బోయిన్పల్లి క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే (MLA Rajasekhar Reddy) మాట్లాడుతూ.. మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని వక్ఫ్ బోర్డు భూములని(Waqf Board Lands) కొన్ని సర్వే నంబర్లలో రిజిస్ట్రేషన్లను నిలిపివేయడంలో ప్రజలలో గందరగోళం ఏర్పడిందన్నారు. కొన్ని దశాబ్దాలుగా అన్ని రకాల ప్రభుత్వ పన్నులు కట్టి 40గజాలు, 50గజాలు, 100గజాలలో పేదలు ఇండ్లు కట్టుకుని నివసిస్తున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వం విద్యుత్ కనెక్షన్లు, సీసీ రోడ్లు, స్ట్రీట్ లైట్లు, డ్రైనేజీ సౌకర్యం కల్పించాయి. పేదల కోసం వక్ఫ్ బోర్డు కొన్ని సవరణలు చేయాల్సిఉందని, లేదంటే ప్రజల పక్షాన నిలబడి వారికి చట్ట బద్దంగా న్యాయం జరిగేలా పోరాటం చేస్తామని అన్నారు. వక్ఫ్ బోర్డు తమ భూమిఅని చెబుతున్న సర్వే నంబర్ 398, 399లో దాదాపు 20ఎకరాల ఖాళీగా ఉన్న భూమి రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 22ఎ నిషేధిత జాబితాలో ఉన్న ఆ ఖాళీ భూమిని తమదంటూ ఇతరులు స్థానిక పోలీసుల సహకారంతో కబ్జాలో ఉన్నారని అన్నారు.
ఈ భూమిని కాపాడాల్సిన వక్ఫ్ బోర్డు సీఈఓ, జిల్లా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఆడిటర్(వక్ఫ్), మూతవాలి వక్ఫ్ బోర్డు చట్టం సెక్షన్ 52ఎ కింద కేసులు నమోదు చేయడంలో విఫలమయరన్నారు. ఇప్పటికైనా ఆ భూమిని కాపాడాలని, కబ్జా చేసిన వారిపై వక్ఫ్ బోర్డు చట్టం సెక్షన్ 52ఎ కింద పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. పేద ప్రజల కోసం న్యాయపరంగా ఏ సాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Notices | ధాన్యం బకాయిలు చెల్లించాలని రైస్ మిల్ యజమానికి నోటీసులు
mother kills son | మరో కులం మహిళను పెళ్లి చేసుకుంటానన్న కొడుకు.. హత్య చేసిన తల్లి
High Blood Pressure | చలికాలంలో బీపీ పెరుగుతుందా..? మందుల డోసు పెంచి వేసుకోవాలా..?
Farmer | ‘రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ బ్రోకర్ ముచ్చట్లే.. తెల్లారి లేస్తే మాకు కేసీఆరే గుర్తొస్తరు’
Annamayya Song | ఇంటర్నేషనల్ స్టేజ్‌పై మార్మోగిన అన్నమయ్య కీర్తన.. ‘బ్రహ్మమొక్కటే’ పాటకు గూస్బంప్స్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

