మెరుగైన వసతుల కల్పనకు కృషి
బస్తీలు, కాలనీలలో మెరుగైన వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. ఆదివారం ప్రగతి యాత్రలో భాగంగా 65 వ రోజు ఎమ్మెల్యే సుభాష్‌నగర్ డివిజన్ పరిధి దయానంద్‌నగర్ , రాజుల స్వామి నగర్, సంతోష్‌నగర్‌లలో పాదయాత్ర నిర్వహించారు
- ప్రగతి యాత్రలో ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్
జీడిమెట్ల, మే 21 : బస్తీలు, కాలనీలలో మెరుగైన వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. ఆదివారం ప్రగతి యాత్రలో భాగంగా 65 వ రోజు ఎమ్మెల్యే సుభాష్‌నగర్ డివిజన్ పరిధి దయానంద్‌నగర్ , రాజుల స్వామి నగర్, సంతోష్‌నగర్‌లలో పాదయాత్ర నిర్వహించారు. ఆయా బస్తీల్లో పూర్తి చేసిన అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. మిగిలి ఉన్న సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులను త్వరలో పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా అన్ని సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మంత్రి కేటీఆర్ సహకారంతో ప్రతి బస్తీలో మౌలిక వసతులను కల్పిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జలమండలి డీజీఎం అప్పల నాయుడు, ఏఈ సురేంద్రనాయక్, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు పోలే శ్రీకాంత్, సీనియర్ నాయకులు వెంకట స్వామి, యూసుఫ్, చిన్న వెంకట స్వామి, మహమ్మద్ వలీ, యండి. మన్నన్, పందిరి యాదగిరి, రాజ్‌కుమార్, రవి, స్వామి, కృష్ణ, చారి, లక్ష్మీకాంత్, విష్ణువర్ధన్ రెడ్డి, అశోక్, రాధాకృష్ణతో పాటు బస్తీ వాసులు పాల్గొన్నారు.
ఆలయాల అభ్యున్నతికి కృషి
కుత్బుల్లాపూర్,మే21 : నియోజకవర్గంలో ఉన్న ఆలయాలను అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ఆదివారం జీడిమెట్ల డివిజన్ పరిధిలోని ప్రసూననగర్ కోదండ రామాలయ ప్రాంగణంలో కాలనీవాసి తమ్మినీడి నాగేశ్వరరావు, వల్లిశ్రీల సహకారంతో నిర్మించిన దేవాలయ నూతన కార్యాలయం భవనాన్ని ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా దాతను సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
శివశక్తి ధ్యానయోగా కో-ఫౌండర్ కే.పూర్ణసాయి తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ నుంచి యోగా పోటీ జడ్జీగా నియమితుడైన సందర్భంగా ఆదివారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ తన నివాసంలో సన్మానించి అభినందించారు. పూర్ణసాయి నేతృత్వంలో శిక్షణ పొందిన యోగా విద్యార్థులు ఏడివైపి-ఇండియన్ యోగా థెరపీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఇటీవల కూకట్‌పల్లిలో జరిగిన రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో జాస్మిన్ అనే విద్యార్థిని గోల్డ్ మెడల్, మన్విత, సాహితీలు సిల్వర్ మెడల్స్ సాధించిన సందర్భంగా వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో శివశక్తి ధ్యాన యోగా ఫౌండర్ కే.మల్లేశ్, సాధన బృందం వేణుగోపాల్, హరికృష్ణ, సంపత్, మూర్తి, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

