సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు
Metro Rail | రెండో దశ మెట్రో రైలు పనులకు ఈ నెల 9వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్‌లోని పోలీసు గ్రౌండ్స్‌లో బహిరంగ సభ
హైదరాబాద్ : రెండో దశ మెట్రో రైలు పనులకు ఈ నెల 9వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్‌లోని పోలీసు గ్రౌండ్స్‌లో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహముద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. రెండో దశ మెట్రో లైన్ గొప్ప ప్రాజెక్టు అని పేర్కొన్నారు. మైండ్ స్పేస్ జంక్షన్ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు 31 కిలోమీటర్ల మెట్రో రైలు లైన్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే 93 కిలోమీటర్ల మేర మొదటి దశలో మెట్రో రైలు సేవలు అందుతున్నాయన్నారు. మైండ్ స్పేస్ జంక్షన్ వద్ద రెండో దశ పనులకు కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని తెలిపారు. అనంతరం రాజేంద్ర నగర్ పోలీస్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారని తలసాని స్పష్టం చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Burglars loot jewellery showroom | నిన్న ఖజాన, ఇవాళ కిస్నా.. జ్యుయలరీ షాపులో భారీ దోపిడి.. రూ.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

