సిటీబ్యూరో, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : నెక్లెస్‌రోడ్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నీరా కేఫ్ పనులను ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ సోమవారం పరిశీలించారు. నీరా కేఫ్ పనులను శరవేగంగా పూర్తి చేయాలని టూరిజం, ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, టూరిజం ఎండీ మనోహర్, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్, సహాయ కమిషనర్ చంద్రయ్య, ఇంజినీర్ అధికారులు వెంకటరమణ, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.