శామీర్‌పేట, మే 22 : ప్రపంచంనే గొప్ప క్రీడాకారులుగా తెలంగాణ యువతను తీర్చిదిద్దేందుకే సీఎం కప్ అని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా తూంకుంట మున్సిపాలిటీ హకీంపేటలోని తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలలో సోమవారం సీఎం కప్-2023 జిల్లా స్థాయి క్రీడాపోటీలను జిల్లా యువజన, క్రీడాశాఖ అధికారి బలరామరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మండల, జిల్లా, రాష్ర్ట స్థాయిలో పోటీలు నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి శిక్షణ ఇస్తే ప్రపంచ స్థాయి క్రీడాకారులు తయారవుతారని తెలిపారు.
క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడాశాఖ అధికారి బలరామరావు, ఎంపీపీ ఎల్లూబాయిబాబు, జడ్పీటీసీ అనితలాలయ్య, వైస్ చైర్మన్ వాణివీరారెడ్డి, కమిషనర్ జేతూరామ్నాయక్, ఎంపీడీవో వాణి, మేనేజర్ శ్రవణ్‌కుమార్, కౌన్సిలర్ రాజ్కుమార్యాదవ్, సీతారామచంద్రస్వామి దేవాలయం చైర్మన్ సుధాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ అధ్యక్షులు నోముల శ్రీనివాస్‌రెడ్డి, సుదర్శన్, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్ యాదవ్, మాజీ సర్పంచ్ గోల్డ్ శ్రీనివాస్ ముదిరాజ్, వజ్జెల మురళి, నవీన్, కృష్ణారెడ్డి, ఆంజనేయులు, చాంద్‌పాషా, ప్రణయ్, బాబు, వెంకట్‌రెడ్డి, కోచ్‌లు, క్రీడాకారులు పాల్గొన్నారు.