నేడు అందుబాటులోకి ఓఆర్ఆర్ సైకిల్ ట్రాక్
దేశంలోనే మొట్ట మొదటి సారిగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పర్యావరణ హితంగా నిర్మించిన సోలార్ రూప్ టాప్ సైకిల్ ట్రాక్‌ను అక్టోబర్ 1న (నేడు) ప్రారంభించనున్నారు.
- సాయంత్రం 6 గంటలకుప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
సిటీబ్యూరో, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : దేశంలోనే మొట్ట మొదటి సారిగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పర్యావరణ హితంగా నిర్మించిన సోలార్ రూప్ టాప్ సైకిల్ ట్రాక్‌ను అక్టోబర్ 1న (నేడు) ప్రారంభించనున్నారు. గ్రేటర్ చుట్టూ 158 కి.మీ మేర నిర్మించిన ఔటర్ రింగు రోడ్డు లోపలి వైపు సుమారు 23 కి.మీ దూరంతో ఎంతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ చేపట్టింది. నిర్మాణ పనులన్నీ పూర్తి కావడంతో ఆదివారం సాయంత్రం 6గంటలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సోలార్ రూప్ టాప్ సైకిల్ ట్రాక్‌ను ప్రారంభించనున్నారు. ఐటీ కారిడార్‌లోని నానక్‌రాంగూడ నుంచి నార్సింగి, మంచిరేవుల మీదుగా తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు, నార్సింగి నుంచి కోకాపేట, వట్టినాగులపల్లి మీదుగా కొల్లూరు వరకు మొత్తం 23 కి.మీ దూరం సోలార్ రూప్ టాప్ సైకిల్ ట్రాక్‌ను నిర్మించారు. ఈ సైకిల్ ట్రాక్‌పై సుమారు 16 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో సోలార్ పవర్ విద్యుత్‌ను ఉత్పత్తి చేసేలా దీన్ని డిజైన్ చేసి ఏర్పాటు చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

