కలుషిత వ్యర్థ జలాల సమస్యకు పరిష్కారం
జవహర్‌నగర్ ముఖచిత్రాన్ని సంపూర్ణంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా మరో కీలక మైలురాయిని అధిగమించనున్నది.
- జవహర్‌నగర్ డంపింగ్‌యార్డులో మరో మైలురాయి
- నేడు లిక్విడ్ వేస్ట్ శుద్ధి ప్లాంట్‌ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
- రూ.250 కోట్లతో నిర్మాణం
సిటీబ్యూరో, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ) : జవహర్‌నగర్ ముఖచిత్రాన్ని సంపూర్ణంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా మరో కీలక మైలురాయిని అధిగమించనున్నది. ఇప్పటికే వ్యర్థాల నిర్వహణలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న జీహెచ్ఎంసీ, తాజాగా కొన్నేండ్లుగా పేరుకుపోయిన లిక్విడ్ వేస్ట్ (లీచెట్) శుద్ధి చేసే ప్రయత్నాల్లో విజయం సాధించబోతున్నది. ఈ మేరకు జవహర్‌నగర్ డంపింగ్ యార్డు ప్రాంగణంలో కాలుష్య కారక వ్యర్థాల (లీచెట్) శుద్ధి ప్లాంట్‌ను రూ. 250 కోట్లతో రాంకీ సంస్థ రెండు ఎంఎల్డీల సామర్థ్యంతో నిర్మించింది. ఈ ప్లాంట్‌ను పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, మంత్రి మల్లారెడ్డితో కలిసి శనివారం ప్రారంభించనున్నారు.
ప్లాంట్‌కు శ్రీకారం చుట్టారు ఇలా..
2017లో ప్రారంభించిన మొబైల్ ఆర్వో సిస్టం ద్వారా రోజుకు 2వేల కిలో లీటర్ల కెపాసిటీతో కలిగిన పాక్షిక ట్రీట్మెంట్ పరిషారాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత రోజుకు 4వేల కిలోలీటర్లకు పెంచారు. దీంతో పాటు అప్పటికే వ్యర్థ జలాలు నిండిన మలారం చెరువులోని దాదాపు 11.67 లక్షల కిలో లీటర్ల నీటిని శుద్ధి చేసేందుకు ప్రయత్నాలు కొనసాగాయి. అంతేకాకుండా ఈ చెరువులోని వ్యర్థ జలాలు పొంగిపొర్లకుండా సుమారు 4 కోట్ల 35 లక్షలతో స్ట్రామ్ వాటర్ డైవర్షన్ నిర్మాణాన్ని కూడా పూర్తి చేసింది. జవహర్‌నగర్ డంప్ యార్డ్ పైనుంచి వచ్చే వరద నీటి వల్ల జరుగుతున్న కాలుష్యాన్ని పూర్తిగా అరికట్టడం కోసం క్యాపింగ్ పనులు చేపట్టిన జీహెచ్ఎంసీ 2020 నాటికి పూర్తి చేసింది.
సంపూర్ణంగా శుద్ధి చేసేందుకు..
కలుషిత వ్యర్థ జలాలను సంపూర్ణంగా శుద్ధి చేసేందుకు ఒక సమగ్రమైన పరిషారాన్ని సిద్ధం చేసిన జీహెచ్ఎంసీ, 2020లో సుమారు రూ.250 కోట్లతో జవహర్‌నగర్ డంప్‌యార్డులో వ్యర్థ జలాల ట్రీట్మెంట్, మలారం చెరువుతో పాటు కృత్రిమ నీటి గుంటల రిస్టోరేషన్, శుద్ధి కార్యక్రమాన్ని రాంకీ సంస్థ చేపట్టింది. సంవత్సర కాలంగా కొనసాగుతున్న పనుల్లో భాగంగా ఇప్పటికే 43% మేర మలారం చెరువు శుద్ధి పూర్తయింది. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న కాలుష్య నియంత్రణ మండలి లాంటి ఏజెన్సీలు కూడా ఈ అంశాన్ని ధ్రువీకరించాయి. ఇప్పటికే జీహెచ్ఎంసీ మొదటి దశలో భాగంగా 5.7 ఎకరాల మేర ఉన్న చెరువు నీటిని శుద్ధి చేసింది. పేరుకుపోయిన మురికిని శుద్ధి చేసే పనులు కొనసాగుతున్నవి. త్వరలోనే మల్కారం చెరువు జలాలు శుద్ధి కానున్నాయి. పనులు పూర్తయితే జవహర్‌నగర్, పరిసర ప్రాంతాల్లో ఘన వ్యర్థాలతోపాటు, కలుషిత జలాల సమస్య కూడా పూర్తిగా అరికట్టబడుతుంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్‌ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

