బోనాలు ఘనంగా చేసుకుందాం..
గోల్కొండ బోనాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ తెలిపారు. బుధవారం గోల్కొండ కోట జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో నెల రోజుల పాటు జరిగే బోనాలను పకడ్బందీగా నిర్వహించేందుకు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో మంత్రులు కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.
- దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ
మెహిదీపట్నం, జూన్ 26: గోల్కొండ బోనాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ తెలిపారు. బుధవారం గోల్కొండ కోట జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో నెల రోజుల పాటు జరిగే బోనాలను పకడ్బందీగా నిర్వహించేందుకు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో మంత్రులు కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ తెలంగాణ ఆషాఢ మాసం బోనాలు గోల్కొండ కోట జగదాంబిక ఎల్లమ్మ ఆలయం నుంచే ప్రారంభం కావడం ఆనవాయితీగా వస్తున్నదన్నారు. ఈ సంవత్సరం తెలంగాణ దశాబ్ది బోనాల ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి 20 కోట్ల రూపాయలను కేటాయించినట్లు వెల్లడించారు. గోల్కొండ బోనాలను ప్రజలందరూ కలిసికట్టుగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలన్నారు. గోల్కొండ కోటకు బోనాలతో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఇదిలా ఉండగా, సమావేశానికి హాజరు కాని అధికారులపై మంత్రి సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గోల్కొండ కోటలో నీటి కొరత ఉండొద్దని, కోటకు వచ్చే రహదారుల మరమ్మతులు పూర్తి చేయాలని, విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్‌రెడ్డి, కార్వాన్ నియోజకవర్గం ఎమ్మెల్యే కౌసర్‌మొహినుద్దీన్, దేవాదాయ కమిషనర్ హనుమంత్‌రావు, జోనల్ కమిషనర్ అనురాగ్ జయంత్, దక్షిణ, పశ్చిమ మండలం డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, ట్రాఫిక్ డీసీపీ వెంకటేశ్వర్లు, ఈవో శ్రీనివాస రాజు, కాంగ్రెస్ నాయకులు ఉస్మాన్బిన్ అల్ హజ్రీ, జీవన్‌సింగ్, కులవృత్తుల సంఘం అధ్యక్షుడు సాయిబాబాచారి తదితరులు పాల్గొన్నారు. కాగా, కులవృత్తుల వారికి భత్యం 5000 రూపాయలు చేయాలని సాయిబాబాచారి కోరడంతో మంత్రి కొండ సురేఖ సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కులవృత్తుల సంఘం నాయకులు మంత్రి కొండ సురేఖకు గోల్కొండ బోనాల చిత్రపటాన్ని బహూకరించారు.
విదేశీ మీడియాకు..
గోల్కొండ బోనాల విశిష్టత..
గోల్కొండ బోనాల సన్నాహక సమావేశం సందర్భంగా కోటకు వచ్చిన విదేశీ మీడియా ప్రతినిధులకు గోల్కొండ కోట బోనాల విశిష్టతను దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ వివరించారు. నెల రోజుల పాటు బోనాలు ఏ విధంగా జరుగుతాయో వివరించిన ఆమె.. ఇక్కడ బోనాలు అందరూ కలిసికట్టుగా నిర్వహిస్తారని, మత సామరస్యాన్ని చాటుతారని చెప్పారు.
గ్రేటర్‌కు బోనాల శోభ
సిటీబ్యూరో, జూన్ 26 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ సంసృతిని చాటి చెప్పే విధంగా బోనాల ఉత్సవాలకు గ్రేటర్ సన్నద్ధమవుతున్నది. ఈ మేరకు ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. ఈమేరకు రూ. 20కోట్లను మంజూరు చేసింది. బోనాల కోసం ప్రభుత్వ దేవాలయాలకే కాకుండా ప్రైవేటు ఆలయాలు సుమారు 3 వేల దేవాలయాలకు ఆర్థిక సహాయం అందించనున్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా బోనాల ఉత్సవాలను నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో రహదారుల మరమ్మతులు, శానిటేషన్ విభాగం ఆధ్వర్యంలో దేవాలయాల పరిసరాల్లో పారిశుధ్య కార్యక్రమాలు జరగనున్నాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

