హైదరాబాద్ : కన్స్ట్రక్షన్ యూనివర్సిటీ(Construction university) ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి(Minister Komati Reddy) అన్నారు. మాదాపూర్లో న్యాక్ పాలకమండలి(Governing Body of NAC) సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
కన్స్ట్రక్షన్ యూనివర్సిటీ ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన తర్వాత నిర్ణయం తీసు కుంటామన్నారు. ప్రత మండలంలో వృత్తి నైపుణ్య కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే కన్స్ట్రక్షన్ అకాడమీని ఏర్పాటు చేస్తామని మంత్రి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.