Minister Errabelli | డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం మంత్రి ఎర్రబెల్లి సంతకం ఫోర్జరీ చేసిన కేటుగాళ్లు
Minister Errabelli Dayakar Rao | డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలంటూ మంత్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి, మంత్రి లెటర్ హెడ్‌తో బోగస్ సిఫార్స్ లేఖ తయారు చేసి సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఇచ్చిన ఇద్దరిపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది.
Minister Errabelli Dayakar Rao | బంజారాహిల్స్, ఆగస్టు 20: డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలంటూ మంత్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి, మంత్రి లెటర్ హెడ్‌తో బోగస్ సిఫార్స్ లేఖ తయారు చేసి సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఇచ్చిన ఇద్దరిపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది.
పోలీసుల కథనం ప్రకారం.. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలంటూ సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఇటీవల పంచాయత్ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేరుతో కొన్ని సిఫార్సు లేఖలు వచ్చాయి. గతంలో ఎన్నడూ ఇలాంటి సిఫార్సు లేఖలు తమకు రాలేదని, అధికారులు ఈ విషయాన్ని మంత్రి ఎర్రబెల్లి కార్యాయలం దృష్టికి తీసుకువెళ్లారు. సిఫార్సు లేఖలపై ఆరా తీయగా.. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం నర్రెగూడెం గ్రామానికి చెందిన ఎండీ. గౌస్ పాషా, గుంటి శేఖర్ వీటిని తయారు చేసినట్లు తేలింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేరుతో నకిలీ లెటర్ హెడ్‌ను తయారు చేయడంతో పాటు ఏకంగా మంత్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి సంగారెడ్డి కలెక్టర్‌కు సిఫార్సు లేఖలను పంపించినట్లు తేలింది. ఈ మేరకు మంత్రి ఓఎస్డీ డా.రాజేశ్వర్‌రావు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితులు గౌస్‌పాషా, గుంటి శేఖర్‌పై ఐపీసీ 419, 420, 464, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajnath Singh | దేశాన్ని అస్తిర పరిచేందుకు, ప్రభుత్వాన్ని కూల్చేందుకే ఆందోళనలు.. ఇండియా బ్లాక్‌పై రాజ్‌నాథ్ సింగ్ ఆరోపణ
KTR | ఆంధ్రలో జల పండగ ఎట్లయితది? తెలంగాణలో కరువు ఎందుకుంటది? సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే నివాసానికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు.. ర్యాలీకి వెళ్లకూడదంటూ నోటీసులు జారీ
Kumbha | ‘కుంభ’లోని శక్తిని ఇప్పుడే తట్టిలేపాలని అనుకోవడం లేదు.. పృథ్వీరాజ్ బర్త్‌డేపై రాజమౌళి ట్వీట్
Vidya Balan | ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్.. నా కల నెరవేరలేదంటూ విద్యాబాలన్ భావోద్వేగం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

