హైదరాబాద్లో భారీగా డ్రగ్స్ స్వాధీనం
Drugs | హైదరాబాద్ నగరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. ముంబైకి చెందిన నలుగురు డ్రగ్ స్మగ్లర్లను హైదరాబాద్ నార్కోటిక్ విభాగం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. ముంబైకి చెందిన నలుగురు డ్రగ్ స్మగ్లర్లను హైదరాబాద్ నార్కోటిక్ విభాగం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఠా సభ్యుల నుంచి 204 గ్రాముల ఎండీఎంఏను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్ స్మగ్లర్లపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నగరంలోని పలువురు ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేసేందుకు ఈ ముఠా ముంబై నుంచి వచ్చినట్లు తెలుస్తోంది.
గంజాయి తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్
హైదరాబాద్లో గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఈస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం ఉదయం అరెస్టు చేశారు. ఆ ముఠా నుంచి 110 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న కారును సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

