పరిష్కారం కాకుండానే..అయినట్లు ఫీడ్‌బ్యాక్
జలమండలి కస్టమర్ కేర్ సెంటర్ (ఎంసీసీ)ని ఎండీ అశోక్‌రెడ్డి సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. వినియోగదారుల నుంచి వస్తున్న కాల్స్, స్పందనను ఆయన పరిశీలించారు.
- జలమండలి ఎండీ అసంతృప్తి
సిటీబ్యూరో, జూలై 22 (నమస్తే తెలంగాణ ) : జలమండలి కస్టమర్ కేర్ సెంటర్ (ఎంసీసీ)ని ఎండీ అశోక్‌రెడ్డి సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. వినియోగదారుల నుంచి వస్తున్న కాల్స్, స్పందనను ఆయన పరిశీలించారు. ఇందుకోసం స్వయంగా కొందరు వినియోగదారులతో ఎండీ మాట్లాడారు. కాల్ రికార్డింగ్స్ విన్నారు. సీవరేజీ ఓవర్ ఫ్లో, రోడ్డుపై సిల్ట్, మ్యాన్‌హోల్స్ వంటి వాటిపై ఫిర్యాదులు వచ్చాయి. సమస్య పరిష్కారమైన తర్వాత వినియోగదారులకు కచ్చితంగా సమాచారం అందించాలని ఎండీ అశోక్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తర్వాత వినియోగదారుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. మొత్తం 5514 ఫీడ్ బ్యాక్ కాల్స్ తీసుకోగా, అందులో 3 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు.
14 శాతం మంది సమస్యను పరిష్కరించకుండానే పరిష్కారమైనట్లు ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. అలాంటి వాటి విషయంలో క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు..వాటిని నేరుగా సందర్శించి, పరిష్కారమయ్యేలా చూడాలని ఎండీ ఆదేశించారు. వినియోగదారులకు మంచి సేవలు అందించడంతో పాటు కస్టమర్ కేర్ సేవా కార్యకలాపాల్లో పారదర్శకత, జవాబుదారీతనం చూపేందుకే ఈ తనిఖీ నిర్వహించామన్నారు. జూన్‌లో 1,30,899 మంది ట్యాంకర్లు బుక్ చేసుకోగా, 1,86, 251 ట్రిప్పులు డెలివరీ చేసినట్లు అధికారులు తెలిపారు. జూన్‌లో 75, 555 ఫిర్యాదులు రాగా..అందులో 75,496 సమస్యలను పరిష్కరించినట్లు చెప్పారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

