విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
డెంగీ నియంత్రణలో అందరూ భాగస్వాములు కావాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో బుధవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ ఆమ్రపాలితో కలిసి వైద్య ఆర్యోగ శాఖ, ఎంటమాలజీ, శానిటేషన్ విభాగాల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు.
- ఏఎంహెచ్వోలకు మేయర్ హెచ్చరిక
సిటీబ్యూరో: డెంగీ నియంత్రణలో అందరూ భాగస్వాములు కావాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో బుధవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ ఆమ్రపాలితో కలిసి వైద్య ఆర్యోగ శాఖ, ఎంటమాలజీ, శానిటేషన్ విభాగాల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. వర్షాకాలం కావడంతో దోమలతో డెంగీ, మలేరియా, చికెన్ గున్యా తదితర వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మేయర్ అన్నారు. ఏఎంహెచ్వోలు విధులను బాధ్యతగా నిర్వర్తించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలకు నమ్మకం కలిగించేలా ఆయా అధికారులు సమన్వయంతో పనిచేసి భరోసా కల్పించాలని కమిషనర్ ఆమ్రపాలి అన్నారు. ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేకుండా పనిచేయాలని కోరారు. అనంతరం ‘జాయిన్ ది ఫైట్ అగెనెస్ట్ డెంగీ’ అన్న నినాదంతో రూపొందించిన పోస్టర్‌ను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ ఆమ్రపాలితో కలిసి ఆవిష్కరించారు. ఈ సమావేశంలో శానిటేషన్ అడిషనల్ కమిషనర్ రవి కిరణ్, సీఎంహెచ్వో డాక్టర్ పద్మజారాణి, చీఫ్ ఎంటమాలజిస్ట్ డాక్టర్ రాంబాబు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులను నివారిద్దాం
- వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ క్రిస్టినా చొంగ్తూ
వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధులను నివారించేందుకు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ క్రిస్టినా చొంగ్తూ అధికారులకు సూచించారు. బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో వైద్య ఆరోగ్య, శానిటేషన్, ఎంటమాలజీ, మలేరియా విభాగాల అధికారులతో సీజనల్ వ్యాధుల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై బల్దియా కమిషనర్ ఆమ్రపాలితో కలిసి ఆమె సమీక్ష నిర్వహించారు. నగరంలో మలేరియా, డెంగీ, చికెన్ గున్యా, జ్వరాల గురించి ఆరా తీశారు. ప్రభుత్వం డెంగీ కేసుల విషయమై రాష్ట్రవ్యాప్తంగా పరిశీలన చేస్తూ, నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నదని క్రిస్టినా తెలిపారు. నగరంలో విస్తరిస్తున్న డెంగీ వ్యాధిని నియంత్రించేందుకు క్షేత్రస్థాయిలో విసృ్తత చర్యలు చేపట్టాలన్నారు. వైద్యారోగ్య, శానిటేషన్, ఎంటమాలజీ, తదితర అనుబంధ విభాగాలు పరస్పర సమన్వయంతో పని చేస్తూ, సీజనల్ వ్యాధుల నివారణకు అంకితభావంతో కృషి చేయాలన్నారు. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరిస్తూ, అవగాహన కల్పించాలని సూచించారు. పారిశుధ్య కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు. దోమలు వ్యాప్తి చెందకుండా ఫాగింగ్ చేయాలని, వ్యాధుల పరిస్థితిపై రోజు వారీ నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఇంటింటి సర్వే చేసినప్పుడు గుర్తించిన జ్వరం కేసులకు సంబంధించి వెంటనే తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. పాఠశాలలు, హాస్టళ్ల పై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, డెంగీ తదితర కేసులు పెరగకుండా నియంత్రించడంలో చేపట్టాల్సిన చర్యలపై అవగాహన కల్పించాలని క్రిస్టినా సూచించారు. ఈ సమావేశంలో సీఎంహెచ్వో డాక్టర్ పద్మజారాణి, ఎంటమాలాజీ చీఫ్ రాంబాబు, సంగారెడ్డి, మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల డీఎంహెచ్వోలు, ఈఎంహెచ్వో, డిప్యూటీ ఈఈలు, మలేరియా అధికారులు, జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalvala Project | ‘కల్వల’పై పట్టింపేది?.. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుపై నిర్లక్ష్యం.. మూడేళ్లయినా మరమ్మతులు శూన్యం
Sandeep Kumar: 400మీటర్ల స్ప్రింట్‌లో వరల్డ్ రికార్డు.. సందీప్ కుమార్‌కు స్వర్ణ పతకం
Karimnagar | పరారులో భూ మాఫియా!.. ‘నమస్తే’ కథనంతో వెలుగులోకి కోతిరాంపూర్ భూకబ్జా
Krishnaraj | తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం ..ప్రముఖ నేపథ్య గాయకుడు కృష్ణరాజ్ కన్నుమూత
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి వేడుకల్లో మార్పులు.. నవంబర్ 21న గ్రాండ్ రిసెప్షన్!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

