Major Fire | ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న ఇద్దరు పిల్లలు సహా ఆరుగురు ?
Major Fire | నాంపల్లిలోని చీరక్గల్లి లైన్లో శనివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
హైదరాబాద్ : నాంపల్లిలో బచ్చా క్రిస్టల్ ఫర్నిచర్ దుకాణంలో ( Furniture Store ) భారీ అగ్నిప్రమాదం జరిగింది. నాలుగు అంతస్తుల భవనంలో ఇద్దరు చిన్నారులతో సహా ఆరుగురు చిక్కుకున్నట్లు సమాచారం . 10 ఫైరింజన్లతో రంగంలోకి దిగి రెస్క్యూ టీం మంటలను అర్పే చర్యలు చేపట్టారు. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
గ్రౌండ్ ఫ్లోర్ నుంచి దట్టమైన పొగలు రావడంతో వారు బయటకు రాలేక పై అంతస్తుల్లోనే ఉండిపోయారు. జేసీబీలు, భారీ క్రేన్ల సహాయంతో భవనం పైభాగంలో ఉన్న వారిని క్షేమంగా బయటకు తీసుకువచ్చేందుకు రెస్క్యూ టీమ్ తీవ్రంగా శ్రమిస్తోంది. గాలి పీల్చుకోవడం ఇబ్బందిగా మారడంతో లోపల ఉన్న వారి పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా మారింది.
నాంపల్లి వంటి ఇరుకైన గల్లీలు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకోవడం సవాలుగా మారుతోంది. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగిన నేపథ్యంలో వాణిజ్య సముదాయాల్లో ‘ ఫైర్ సేఫ్టీ ’ నిబంధనలు పాటించకపోవడంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా నివాస గృహాల మధ్య ఇలాంటి గోడౌన్లు లేదా దుకాణాలు ఉండటం వల్ల ప్రమాద తీవ్రత పెరుగుతోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

