హైదరాబాద్: నగరంలోని గగన్ పహాడ్‌లో (Gagan pahad) భారీ అగ్నిప్రమాదం జరిగింది. గగన్‌పహాడ్‌లోని కరాచీ గోదాంలో (Karachi godown) గురువారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి గోదాం మొత్తానికి వ్యాపించాయి. దీంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఆ ప్రాంతంలో పెద్దఎత్తున్న పొగలు అలముకున్నాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. అగ్నిప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.