ఇంట్లోకి తీసుకెళ్లి.. బాలికపై లైంగికదాడి
ముక్కుపచ్చలారని బాలిక(5)పై లైంగికదాడికి పాల్పడ్డ దుండగుడికి 20 ఏండ్ల జైలు శిక్ష, రూ. 25 వేల జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. అదనపు పీపీ బర్ల సునీత కథనం ప్రకారం..
- కామాంధుడికి 20 ఏండ్ల జైలు
- రూ. 25వేల జరిమానా
రంగారెడ్డి జిల్లా కోర్టులు, సెప్టెంబర్ 28(నమస్తే తెలంగాణ): ముక్కుపచ్చలారని బాలిక(5)పై లైంగికదాడికి పాల్పడ్డ దుండగుడికి 20 ఏండ్ల జైలు శిక్ష, రూ. 25 వేల జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. అదనపు పీపీ బర్ల సునీత కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మంచాలకు చెందిన నిందితుడు శ్రీనివాస్ తన ఇంటి దగ్గర ఉండే కూతురు వరసయ్యే బాలికను డిసెంబర్7, 2015న ఇంట్లోకి తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. జరిగిన ఘోరాన్ని బాలిక తన తండ్రికి చెప్పింది. దీంతో బాలిక తండ్రి మంచాల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు శ్రీనివాస్‌ను అరెస్టు చేసి, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. సాక్షాధారాలను పరీశీలించిన న్యాయస్థానం.. నిందితుడికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.
మరో కేసులో…
బాలిక (16)ను పెళ్లి చేసుకోవాలని వేధించిన స్కూల్ డ్రైవర్ హర్షవర్ధన్‌కు మూడేండ్ల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. పదో తరగతి చదువుతున్న బాలికను స్కూల్ డ్రైవర్ పెళ్లి చేసుకోవాలని వేధించాడు. లేకుంటే చంపుతానని బెదిరించడంతో వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు హర్షవర్ధన్‌ను అరెస్టు చేసి, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. సాక్షాధారాలను పరీశీలించిన న్యాయస్థానం నిందితుడికి శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- 5 year old
- abuse
- Girl
- Hyderabad
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

