నగరంలో యువకుడి దారుణ హత్య.. జనాలు చూస్తుండగానే కత్తులతో దాడి..
man murdered | నగరంలో ఆదివారం ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పట్ట పగలు నడిరోడ్డుపై వాహనదారులు చూస్తుండగానే.. యువకుడు ముగ్గురు వ్యక్తులు చుట్టుముట్టి కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర
హైదరాబాద్ : నగరంలో ఆదివారం ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పట్ట పగలు నడిరోడ్డుపై వాహనదారులు చూస్తుండగానే.. యువకుడు ముగ్గురు వ్యక్తులు చుట్టుముట్టి కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలకు గురైన సదరు యువకుడు అక్కడక్కడే మృతి చెందాడు. ఘటన తర్వాత ముగ్గురు నిందితులు సంఘటనా స్థలం నుంచి పరారయ్యారు. అయితే, హత్యకు గురైన యువకుడి యువకుడి వివరాలు, హత్యకు గల కారణాలు సైతం తెలియరాలేదు. ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో న్యూ జియాగూడలోని పురాణాపూల్ వెళ్లే రోడ్డుపై ఈ ఘటన జరిగింది. ఓ యువకుడు ముగ్గురు కత్తులతో వెంబడించారు.
యువకుడు పారిపోతూ పడిపోవడంతో ఆ తర్వాత ముగ్గురు విచక్షణారహితంగా దాడి చేశారు. అయితే, రోడ్డు వెంట వెళ్తున్న వారంతా చూస్తూ ఉన్నారే తప్ప అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. మరికొందరు సెల్ఫోన్లలో వీడియోలు తీస్తూ ఉండిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నడిరోడ్డుపై యువకుడి హత్య కలకలం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. మృతుడు ఎవరు అనే వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. మృతుడు ఎవరు ? హత్య చేసింది ఎవరు? కారణాలు ఏంటే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allu Arjun | అల్లు అర్జున్ ఒక్క పోస్ట్‌తో మళ్లీ మొదలైన మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్.. రజినీకాంత్‌పై ప్రశంసలే కారణమా?
Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 125 పాయింట్లు పతనం
Rukmini Vasanth | శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ చిత్రం.. ప్రోమో విడుదల!
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

