హైదరాబాద్: ఇడ్లీ, దోశ, పూరి.. పొద్దునే ఇవీ మన టిఫిన్లు. ఇంతేనా.. ఇంకేమైనా ఉన్నాయా. మన సిటీలో మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ మరేదైనా ఉందా. ఓల్డ్ స్టయిల్లో.. ఏదైనా తిందామా అంటే.. మీరు కచ్చితంగా నిలోఫర్ వెళ్లాల్సిందే. లకిడీకపూల్లో ఉన్న ఆ హోటల్లో మలై బన్ గట్టిగా పట్టించాల్సిందే. తెలతెలవారంగానే పాలమీగడ కలుపుకుని బన్ తింటుంటే.. ఆ టేస్టే వేరప్ప అనాల్సిందే. నిజానికి హైదరాబాదీలకు మలైబన్ కొత్త కాదు. కొన్ని దశాబ్ధాల క్రితం ఉదయం అదే ఇక్కడి ఫుడ్. పాల మీగడతో చేసే మలై రుచే హైలెట్. కాచిన పాల మీగడలో చక్కర వేసి .. ఓ క్రీమ్‌లా పొదుపొద్దున్నే బన్‌తో తింటే.. ఇక ఆ థ్రిల్ అద్భుతమే. ఇప్పటికీ ఆ ట్రెండ్ హైదరాబాద్‌లో కంటిన్యూ అవుతోంది. నీలోఫర్ దానికి అడ్డగా మారింది.
ఉదయం ఆరు లోపే ఆ మలైబన్ కోసం నీలోఫర్ వాచ్చేవాళ్లు ఎక్కువే. స్వీటీ, సాల్టీ టేస్ట్ ఉండే.. మలైబన్ కోసం సిటీలో ఎక్కడెక్కడో ఉన్నవాళ్లు ఇక్కడికి వచ్చేస్తుంటారు. బన్‌తో బ్రేక్‌ఫాస్ట్ చేయాలనుకునేవాళ్లు.. ఆ హోటల్‌కు తెల్లారగానే వాలిపోతారు. తేనటీగల్లా క్యూకట్టి మరీ ఆ టేస్టీ డిష్ కోసం ఎగబడుతుంటారు. ప్లేట్ మలై.. ఓ బన్ తీసుకుని .. తెగ ఇంట్రెస్ట్‌తో కుమ్మేస్తుంటారు. నగరానికి కొత్తగా వచ్చేవాళ్లకు ఆ డిష్ ఏంటో అర్ధం కాదు.. కానీ పాత తరం వాళ్లకు ఆ మలైను ఈజీగా మటాష్ చేసేస్తారు. ప్లేట్ మలైబన్ ఇప్పుడు రూ.60కు అమ్ముతున్నారు. ఇదేమీ పెద్ద కాస్ట్ కాదని, కడుపు నింపే మలైబన్ కోసం ఆ మాత్రం ఖర్చు చేయలేమా అన్న అభిప్రాయాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు.
ఒకప్పుడు సిటీలో ఏ హోటల్‌కు వెళ్లినా.. ముందుగా మలై బన్ కనిపించేది. దాని కోసం హోటళ్ల చుట్టూ రౌండేసేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ మారింది. మలైబన్ తీనేవాళ్లు తక్కువయ్యారు. ఇక ఈ డిష్ దొరుకుతున్న హోటళ్లు కూడా తక్కువే అయ్యాయి. ప్రస్తుతం నీలోఫర్, నిమ్రా(చార్మినార్), చట్టూ రామ్ యాదవ్ మిల్క్ షాప్ (చుడీ బజార్) లాంటి కేఫ్‌లు, హోటళ్ల వద్ద మాత్రమే ఈ మలైబన్ దొరకుతోంది. టేస్ట్ ఉన్న సిటీవోళ్లు ఆ డిష్ కోసం ఇంకా ఈ హోటళ్లకే విజిట్ కొడుతున్నారు.