హైదరాబాద్: నగరంలోని ఓల్డ్ సిటీలో (Old city) భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం ఓల్డ్‌సిటీలోని లాలిత్ బాఘ్‌లో ఉన్న ఓ పాత సామాను గోదామ్‌లో మంటలు చెలరేగాయి. క్రమంగా అవి గోదామ్ మొత్తానికి వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అధికారులు భావిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదంతో సుమారు రూ.10 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు గోదాం యజమాని ఆవేదన వ్యక్తం చేశారు.