Hyderabad | హైదరాబాద్‌లో లగ్జరీ కార్లపై పెరుగుతున్న మోజు.. కొత్త మోడల్ వస్తే చాలు ఆరా తీసేస్తున్నారు!
Hyderabad | లగ్జరీ కార్ల వినియోగంలోనూ విశ్వనగరం దూసుకెళ్తున్నది. ప్రపంచ నగరాల కంపెనీలు హైదరాబాద్‌కు తరలిరావడం.. ఇక్కడే తమ బ్రాంచీలను ఏర్పాటు చేయడం ఓ ఎత్తయితే అదే స్థాయిలో అన్ని రంగాలకు చెందిన వారు నగరంలో స్థిరపడటానికి ఆసక్తి చూపుతున్నారు. సినీ, రాజకీయ, వ్యాపార, నిర్మాణ రంగాలకు చెందిన ప్రముఖులు లగ్జరీ కార్ల వినియోగంలో ముందుంటున్నారు.
Hyderabad | సిటీబ్యూరో, సెప్టెంబర్ 20 ( నమస్తే తెలంగాణ): లగ్జరీ కార్ల వినియోగంలోనూ విశ్వనగరం దూసుకెళ్తున్నది. ప్రపంచ నగరాల కంపెనీలు హైదరాబాద్‌కు తరలిరావడం.. ఇక్కడే తమ బ్రాంచీలను ఏర్పాటు చేయడం ఓ ఎత్తయితే అదే స్థాయిలో అన్ని రంగాలకు చెందిన వారు నగరంలో స్థిరపడటానికి ఆసక్తి చూపుతున్నారు. సినీ, రాజకీయ, వ్యాపార, నిర్మాణ రంగాలకు చెందిన ప్రముఖులు లగ్జరీ కార్ల వినియోగంలో ముందుంటున్నారు. అందుకే లగ్జరీ కార్లకు హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అత్యాధునిక మోడల్ ఏదొచ్చినా కొనుగోలు చేయడానికి వాహన ప్రియులు సిద్ధంగా ఉంటున్నారు. ఏ కంపెనీ? ఏ సిరీస్? ఖరీదు ఎంత? భద్రత చర్యలు ఏమిటీ? ఇలా అనేక కోణాల్లో వాహనదారులు ఆరా తీస్తున్నారు. నచ్చితే కోట్ల రూపాయలు విలువజేసే కారైనా ఇట్టే కొనేస్తున్నారు. వ్యాపార వాణిజ్య, సినీ, రాజకీయ దిగ్గజాలకు కేంద్రమైన నగరంలో ఏటా ఈ తరహా విలాసవంతమైన వాహనాల అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. కనీసం రూ.20లక్షలు మొదలు కొని రూ.7 కోట్లపై విలువైన కార్లు అమ్ముడుపోతున్నాయి. రూ.20 లక్షలు ఆ పై విలువైన కార్లు గతేడాది 17,111 వరకు అమ్ముడు పోగా.. ఈ ఏడాది ప్రస్తుతం (సెప్టెంబర్ 14) వరకు ఆ సంఖ్య 9,217 దాటేసింది. ఇంకా రానున్న పండుగలతో వాటి సంఖ్య 30వేలు దాటుతుందని రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
లైఫ్ టాక్స్‌తో భారీ ఆదాయం..!!
ఖరీదైన వాహనాలతో వచ్చే లైఫ్ టాక్స్తోనూ రవాణా శాఖకు భారీ స్థాయిలో ఆదాయం సమకూరుతోంది. 20 లక్షలు ఆపై విలువజేసే కార్లు 18 శాతం లైఫ్ టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. గతేడాది ఆర్థిక సంవత్సరానికి గాను లైఫ్ టాక్స్ రూ.1740 కోట్లు వచ్చింది. ఈ ఏడాది ఆగస్టు 31 వరకు రూ.1991.49 కోట్లు దాటింది. ఇందులో ఎక్కువ శాతం హైదరాబాద్ నుంచి వచ్చిందే. మూవీ, బిజినెస్, పొలిటికల్ రంగాల ప్రముఖులు ఇతరులకు భిన్నంగా ఉండాలనే కాన్సెప్ట్, అందులో ఉండే భద్రత పరమైన అంశాలతో ఎక్కువగా ఖరీదైన కార్లను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. అంతేకాదు రియల్ఎస్టేట్, ఇతర కంపెనీల పేరు పై కూడా ఖరీదైన వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. గత ఏడాది ప్రముఖ బిజినెస్ మ్యాన్ కుమారుడు నజీర్‌ఖాన్ అనే వ్యక్తి రూ.7 కోట్లపై విలువజేసే ఎంసీల్యారెన్ 765 ఎల్టీ స్పైడర్ వాహనం కొనుగోలు చేశాడు. అంటే ఈ వాహనం విలువ ఆధారంగా లైఫ్‌టాక్స్ 1.26 కోట్లు చెల్లించాడు. ఇలానే హీరో మెగాస్టార్ చిరంజీవి టొయోటా వెల్ఫైర్ లైఫ్ టాక్స్‌తో 1.9కోట్ల రూపాయల విలువజేసే వాహనం కొనుగోలు చేశాడు. ఇటీవల అల్లరి నరేశ్ రూ.65లక్షల విలువజేసే కియాఈవీ6 వాహనం కొనుగోలు చేశాడు. దానిపై లైఫ్ టాక్స్ 11.70లక్షలు చెల్లించాడు.
లగ్జరీ కార్లకు ఆదరణ పెరిగింది..
విలాసవంతమైన కార్లకు డిమాండ్ పెరిగింది. చాలా మంది డబ్బులు ఎంతైనా వెచ్చించి నచ్చిన కార్లను కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా కంపెనీలు తమ వాహనాల్లో భద్రత పరమైన ఫీచర్లను విభిన్న రకాలుగా అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ప్రమాదం జరిగినా తప్పించుకునే రక్షణ కల్పించే భద్రత వ్యవస్థ ఉన్న వాహనాలకు ఎన్ని కోట్లు అయినా వెచ్చిస్తున్నారు.
– పి. రవీందర్ కుమార్, ఆర్టీఓ, ఉప్పల్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Hyderabad
- luxury cars
- new cars
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | రాష్ట్రంలో ఇన్ని హాలిడేలు ఎందుకు.. రేవంత్ రెడ్డికి హాలిడే చెబితే లొల్లిపోదా.. కేటీఆర్ సెటైర్లు
KTR | నల్లమల పిల్లికి ఎలుకలు పట్టడం కూడా చేతనైతలేదా.. రిమ్స్ ఘటనపై కేటీఆర్ ఎద్దేవా
KTR | తెలంగాణకు ప్రధాని మోదీ ఏం ఇచ్చారు.. బీజేపీకి ఎందుకు ఓటేయాలి.. బడే బాయ్ – చోటే బాయ్ బంధంపై కేటీఆర్ ఫైర్
Back Pain | వెన్ను నొప్పికి అసలు కారణాలు ఏమిటి.. ఎలాంటి జాగ్రత్తలను పాటించాలి..
KTR | మూడు నెలల్లో పిల్లలు పుడతారా అన్న రేవంత్.. మరి మూడేళ్లయినా హామీలు ఎందుకు నెరవేర్చలేదు.. రైతు గర్జనలో నిలదీసిన కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!


