సిటీబ్యూరో, ఫిబ్రవరి 14(నమస్తే తెలంగాణ) : మహిళా ఆంత్రప్రెన్యూర్లకు( Women entrepreneurs) లోన్ ఫెసిలిటీ(Loan facility), బ్యాంకర్లను అనుసంధానం చేసేలా వీ హబ్(V hub) ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 19న లోన్ సౌకర్యాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించనుండగా మహిళా ఆంత్రప్రెన్యూర్లు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మహిళలకు అవసరమైన ఆర్థిక ప్రోత్సాహం, లోన్ సదుపాయాలను పొందడానికి బ్యాంకర్లు, ఫైనాన్సియర్ సంస్థలు పాల్గొంటాయని తెలిపారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లోని వీ హబ్ ప్రధాన కార్యా లయానికి ఈ నెల 19న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పూర్తి ధృవీకరణ పత్రాలతో హాజరు కావాలని సూచించారు.