‘గాంధీ’లో లిక్విడ్ ఆక్సిజన్

దక్షిణ భారత దేశంలో ఇదే మొదటిది..
పూర్తి కావొచ్చిన నిర్మాణ పనులు
ఈ నెలాఖరుకు ఉత్పత్తి ప్రారంభించే అవకాశం
ప్రతి నెలా రూ.30 లక్షలు ఆదా : ప్రొఫెసర్ రాజారావు
శ్వాస తీసుకోవడం కష్టమై.. అత్యవసర పరిస్థితుల్లో ఆక్సిజన్ కోసం ఎదురుచూసే బాధితులకు శుభవార్త.. ఇక సికింద్రాబాద్‌లోని గాంధీ దవాఖానలో రోగులకు సరిపడే ఆక్సిజన్ ఉత్పత్తి కాబోతోంది. దవాఖాన ఆవరణలోనే ఒక్కో నిమిషానికి వెయ్యి లీటర్ల లిక్విడ్ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే రెండు ఆక్సిజన్ ప్రెషన్ స్వింగ్ ఎడ్సార్ప్‌సన్ సెంటర్ల ఏర్పాటునకు పనులు ప్రారంభించారు. ఇందుకోసం ప్రత్యేక భవనాన్ని నిర్మిస్తున్నారు. అది పూర్తి కాగానే.. లిక్విడ్ ఆక్సిజన్ తయారు చేసే యంత్ర పరికరాలను ప్రత్యేక వాహనాల్లో తీసుకువచ్చి అమర్చనున్నారు. ఇప్పటికే సివిల్ వర్క్స్ పూర్తి అయ్యాయని.. మరో వారం రోజుల్లో యంత్రాలను అమర్చగానే రూఫ్ ఏర్పాటు చేస్తామని టీఎస్ఎంఐడీసీ ఈఈ సారంగపాణి తెలిపారు. ఏప్రిల్ చివరి నాటికి ఆక్సిజన్ ఉత్పత్తి ప్రారంభించే అవకాశం ఉన్నదని దవాఖాన పరిపాలనా అధికారులు తెలిపారు.
ఈ యూనిట్లో ఆక్సిజన్ ఉత్పత్తి ఇలా..
నీటి ఆవిరి, ఆక్సిజన్, నైట్రోజన్, వివిధ రకాల నోబల్ గ్యాస్‌లను తగు మోతాదులో కలిపి ప్రత్యేకమైన యంత్ర పరికరాలను వినియోగించి వివిధ దఫాల్లో అవసరమైన ఉష్ణోగ్రతల వద్ద వేడి చేస్తారు. తద్వారా ద్రవ రూపంలో ఉన్న ఆక్సిజన్ తయారవుతుంది. దానిని అందుబాటులో ఉన్న ట్యాంకులకు అనుసంధానం చేసి.. ప్రత్యేక పైప్‌లైన్ ద్వారా ఐసీయూలలోని వెంటిలేటర్లకు, ఆక్సిజన్ బెడ్లకు సరఫరా చేస్తారు. రోగుల అవసరాలకు మించి ఉత్పత్తి అయిన ఆక్సిజన్‌ను సిలిండర్లలో నింపి ఇతర దవాఖానలకు, అంబులెన్స్‌లకు సరఫరా చేయనున్నారు. వీటిని రోగులు కూడా తమ ఇండ్లలోనూ వినియోగించుకునే వెసులుబాటు ఉంది.
ఆక్సిజన్ కొరత నివారించే చర్యలు ..
- ప్రస్తుతం గాంధీ దవాఖానలోని ఐసీయూలలో 500 వెంటిలేటర్ బెడ్లు, 1000 ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం వాటికి రోజుకు 20 వేల లీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ అవసరం అవుతున్నది.
- లిండే అనే సంస్థ ఈ లిక్విడ్ ఆక్సిజన్‌ను సరఫరా చేస్తున్నది. ఇందుకు నెలకు రూ.30 లక్షలను ప్రభుత్వం ఆ సంస్థకు చెల్లిస్తున్నది.
- దవాఖానలో ప్రస్తుతం 20 కిలో లీటర్ల ట్యాంక్‌తో పాటు మరో 6 కిలో లీటర్ల ట్యాంకు ఉన్నది.
- పలు సందర్భాల్లో రోగులకు తగినంత ఆక్సిజన్ సరఫరా లేక సమస్యలు తలెత్తుతున్నాయి. గత ఏడాది కరోనా సమయంలో చాలా ఇబ్బంది పడాల్సివచ్చింది.
- రోగుల అవసరాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నాలుగు లిక్విడ్ ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావించింది. అందులో భాగంగానే గాంధీ దవాఖానలో రెండు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ యూనిట్ నిర్మాణం ప్రారంభించింది. త్వరలోనే ఇది అందుబాటులోకి రానున్నది.
యుద్ధ ప్రాతిపదికన నిర్మాణ పనులు
గాంధీ దవాఖానలో ఈ లిక్విడ్ ఆక్సిజన్ ఉత్పత్తి యూనిట్లు ప్రారంభం అయితే…ప్రతి నెలా రూ.30 లక్షలు ఆదా అవుతాయి. అందుకే టీఎస్ఎంఐడీసీ ద్వారా యుద్ధప్రాతిపదికన యూనిట్ భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఏప్రిల్ నెలాఖరులోగా దానిని ప్రారంభించాలని అనుకుంటున్నాం. దక్షిణ భారతదేశంలో ఒక సర్కారు దవాఖానలో ఇదే మొదటిదిగా నిలవనున్నది. ఈ ప్లాంట్ నిర్మాణానికి గాంధీ దవాఖానను ఎంపిక చేయడం ఎంతో ఆనందంగా ఉన్నది. దీంతో పేద రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వెసులుబాటు కలుగనుంది. – ప్రొఫెసర్ రాజారావు, దవాఖాన సూపరింటెండెంట్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

