Youth community building | యువజన సంఘం భవన నిర్మాణానికి శంకుస్థాపన
మన్సూరాబాద్ : ఎల్బీనగర్ నియోజకవర్గంలోని పలు కాలనీలలో యువజన సంఘాల కోసం భవనాలను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. నాగోల్ గ్రామంలో రూ. 81 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేస్తున్న నవచైతన్య యువజన సంఘం భవన నిర్మాణ పనులకు శుక్రవారం ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశంతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే యూత్ కోసం నాలుగు భవనాల నిర్మాణాలను చేపట్టామని తెలిపారు. బండ్లగూడ, త్యాగరాయనగర్ కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం విషయంలో కొందరు కోర్టుకు వెళ్లి స్టే తీసుకురావడం వలన పనులు నిలిచిపోయాయని తెలిపారు. కోర్టు నుంచి త్వరలో స్టే తీసుకువచ్చి త్యాగరాయనగర్ కాలనీలోని కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను పూర్తి చేస్తామని ఆయన తెలిపారు.
కార్పొరేటర్ ప్రోటోకాల్ పాటించాలి: ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి
కార్పొరేటర్ చింతల అరుణ ప్రోటోకాల్ పాటించకుండా ఎమ్మెల్యేగా ఉన్న తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇష్టానుసారంగా అభివృద్ధిపనులకు శంకుస్థాపనలు చేయడం సరికాదని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. అభివృద్ధిపనుల శంకుస్థాపనలకు ఆమెను ఆహ్వానిస్తున్నామని ఆయన తెలిపారు.
ఈ మధ్య కాలంలో కార్పొరేటర్ అందుకు బిన్నంగా వ్యవహరిస్తూ నాగోల్ డివిజన్లో అభివృద్ధిపనులను ప్రారంభిస్తున్నారని తెలిపారు. కార్పొరేటర్ ప్రవర్తన ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో జరిగే అభివృద్ధిపనుల శంకుస్థాపనలకు తాము కార్పొరేటర్‌ను పిలువాల్సిన అవసరం ఉండదని ఆయన తెలిపారు.ఇప్పటికైనా కార్పొరేటర్ పద్దతి మార్చుకోవాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు యెగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త, నాగోల్ కార్పొరేటర్ చింతల అరుణ, మాజీ కార్పొరేటర్లు చెరుకు సంగీత, వజీర్ ప్రకాష్‌గౌడ్, నాగోల్ గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ బద్దం ధనుంజయ గౌడ్, నవచైతన్య యువజన సంఘం అధ్యక్షుడు చెరుకు ప్రవీణ్‌కుమార్ గౌడ్, కార్యదర్శి డాక్టర ఇంద్రాల స్వాతిన్ గౌడ్, కోశాధికారి బద్దం మధుసూధన్ గౌడ్, నాయకులు పల్లె సీతరాములు గౌడ వస్పరి శంకర్, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు తూర్పాటి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalvala Project | ‘కల్వల’పై పట్టింపేది?.. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుపై నిర్లక్ష్యం.. మూడేళ్లయినా మరమ్మతులు శూన్యం
Sandeep Kumar: 400మీటర్ల స్ప్రింట్‌లో వరల్డ్ రికార్డు.. సందీప్ కుమార్‌కు స్వర్ణ పతకం
Karimnagar | పరారులో భూ మాఫియా!.. ‘నమస్తే’ కథనంతో వెలుగులోకి కోతిరాంపూర్ భూకబ్జా
Krishnaraj | తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం ..ప్రముఖ నేపథ్య గాయకుడు కృష్ణరాజ్ కన్నుమూత
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి వేడుకల్లో మార్పులు.. నవంబర్ 21న గ్రాండ్ రిసెప్షన్!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

