ముగిసిన లష్కర్ బోనాలు

- రెండో రోజు పూజలు చేసిన భక్తులు
- ఆకట్టుకున్న పోతరాజుల విన్యాసాలు
- ఆలయాల్లో రంగం, భవిష్యవాణి
బేగంపేట జూలై 26: సికింద్రాబాద్‌లో బోనాల ఉత్స వాలు రెండో రోజు వైభవంగా నిర్వహించారు. సోమవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి సాక సమర్పణ భవిష్యవాణి, బలి, పోతరాజుల విన్యాసాలు, అంబారిపై అమ్మవారి ఊరేగింపు, ఫలహార, తొట్టెల ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి ఊరేగింపు శోభాయామానంగా సాగింది. పోతరాజుల విన్యాసాలు, కళాకారుల వేషధారణలు, ఘటాల ఊరేగింపులతో లష్కర్ పుర వీధులన్నీ మార్మోగాయి. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. సికింద్రాబాద్ ప్రధాన రహదారులతో పాటు పురవీధుల్లో అమ్మవారి నామస్మరణలు, భక్తుల విశేష పూజలు అలరించాయి.
ఆకట్టుకున్న తొట్టెల బండ్ల ఊరేగింపు ..
రాంగోపాల్‌పేట డివిజన్లోని పలు ప్రాంతాల్లో అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించిన అనంతరం భవిష్యవాణి కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం అమ్మవారికి ప్రీతి ప్రాయంగా తయారు చేసి ఫలహారాలు బండిలో పెట్టి ఊరేగింపు నిర్వహించారు. ప్రధానంగా శివాజీనగర్ డొక్కలమ్మ, రాష్ట్ర పతి రోడ్‌లోని దండు మారెమ్మ, సెయింట్ మేరీస్ రోడ్‌లోని పీనుగుల మల్లన్న, సెకండ్ బజార్‌లోని పోచమ్మ, ముత్యాలమ్మ, కళాసీగూడలోని శ్రీదేవి పోచమ్మ, స్టేషన్ రోడ్‌లోని రేణుకా ఎ ల్లమ్మ, తదితర ఆలయాల్లో రంగం నిర్వహించి భవిష్యవాణి వినిపించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

