నకిలీ పత్రాలు సృష్టించి కోట్ల భూమికి ఎసరు
నకిలీ పత్రాలను సృష్టించి కోట్ల విలువ చేసే భూమిని కాజేసిన పలువురు పోలీసులకు అడ్డంగా దొరికారు.
కందుకూరు, ఫిబ్రవరి 25 : నకిలీ పత్రాలను సృష్టించి కోట్ల విలువ చేసే భూమిని కాజేసిన పలువురు పోలీసులకు అడ్డంగా దొరికారు. మండల పరిధిలోని మురళీనగర్ రెవెన్యూ పరిధిలోని11,17 వరకు గల సర్వే నంబర్లలో 32 ఎకరాల 4 గుంటల భూమిని హైదరాబాద్‌కు చెందిన చక్రహరి హర్షవర్ధన్ రాజు, దేవకీదేవి తల్లీ కొడుకులు 2018వ సంవత్సరంలో వీరారెడ్డి, పొలెమోని రాఘురాములు, పిట్టల జంగయ్య, అంబటి జంగయ్యల వద్ద కొనుగోలు చేశారు. వీరికి భూమి ఇప్పిచ్చిన దన్నారం గ్రామానికి చెందిన చుక్కా శ్రీకాంత్‌గౌడ్‌కు ఆ భూమిపై కన్ను పడింది. కాగా శ్రీకాంత్‌గౌడ్ మధ్య వర్తిత్వం చేసి దన్నారం గ్రామానికి చెందిన పిట్టల జంగయ్య వద్ద హర్షవర్ధన్ రాజు, దేవకీదేవికి 5ఎకరాల 4 గుంటల భూమిని ఇప్పించాడు. జంగయ్య తన భూమి తక్కువ ధరకు పోయిందని ఆత్మహత్య చేసుకోవడంతో శ్రీకాంత్‌గౌడ్ తన సొంత భూమి 3 ఎకరాలను జంగయ్య భార్య అంజమ్మ పేరిట చేయించాడు. దీంతో శ్రీకాంత్ గౌడ్ తన భూమి పోయిందని ఎలాగైన చక్రహరి హర్షవర్ధన్ రాజు, దేవకీ దేవిల భూమిని దక్కించుకోవాలనుకున్నాడు.
దీంతో రియల్ వ్యాపారులు గూడూరు గ్రామానికి చెందిన రాములు, తుమ్ములూరు గ్రామానికి చెందిన శ్రీశైలం, మీ సేవా కేంద్రాలను నడుపుపుతున్న ప్రవీణ్ కుమార్, మహేశ్, వినోద్‌లను కలిశారు. హర్షవర్ధన్, దేవకీదేవి మృతి చెందినట్లు సర్టిఫికెట్లు సృష్టించాడు. రాజుతో చేతులు కలిపి బీఎన్ రెడ్డికి చెందిన జగన్మోహన్రెడ్డికి 5ఎకరాల 4గుంటల భూమి రిజిస్ట్రేషన్ చేసి, తిరిగి జగన్మోహన్రెడ్డి చేతనే అంజమ్మకు 7ఎకరాల 6 గుంటల భూమిని ఎకరాకు రూ. 40లక్షల చొప్పున అమ్మివేశారు. మొత్తం 16ఎకరాల 1 గుంట భూమిలో నుంచి విక్రయించిన భూమిలో 3 ఎకరాల 30 గంటల భూమి ఉంది. ఈ భూమిని ఆన్లైన్లో చక్రహరి హర్షవర్ధన్ రాజు పరిశీలించగా 16ఎకరాల గుంట భూమి మార్పిడి అయినట్లు గుర్తించి జనవరి లో పోలీసులను ఆశ్రయించాడు. దీంతో విచారణ జరపగా అసలు విషయం జయటపడినట్లు పోలీసులు తెలిపారు. శనివారం శ్రీకాంత్‌గౌడ్, నర్ల రాములు,ప్రవీణ్‌కుమార్ మహేశ్, వినోద్ లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. పరారీలో ఉన్న రాజు, శ్రీశైలం, రాములు, జగన్మోహన్రెడ్డిలను త్వరలో అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

