కాంగ్రెస్ నేత అండతో భూమి కబ్జా
అధికార పార్టీ నేత అండతో తమకు వారసత్వంగా రావాల్సిన భూములను కొందరు రియల్ వ్యాపారులు కొల్లగొడుతున్నారని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్ములూరు గ్రామానికి చెందిన రైతులు ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైతులు గదగూటి నరేశ్, శ్రీరాములు, యాదమ్మ తమకు జరిగిన అన్యాయాన్ని న్యాయవాది అరుణ్‌కుమార్ రెడ్డితో కలిసి వివరించారు.
ఖైరతాబాద్, నవంబర్ 30 : అధికార పార్టీ నేత అండతో తమకు వారసత్వంగా రావాల్సిన భూములను కొందరు రియల్ వ్యాపారులు కొల్లగొడుతున్నారని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్ములూరు గ్రామానికి చెందిన రైతులు ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైతులు గదగూటి నరేశ్, శ్రీరాములు, యాదమ్మ తమకు జరిగిన అన్యాయాన్ని న్యాయవాది అరుణ్‌కుమార్ రెడ్డితో కలిసి వివరించారు.
తుమ్ములూరులోని సర్వే నంబర్లు 371, 372, 373, 377లలో గల 52 ఎకరాల్లో తమకు వారసత్వంగా 60 శాతం రావాల్సి ఉందని, అయితే తమ వారసుల్లో కొందరిని మభ్యపెట్టి వారి భూములతో పాటు తమ భూములను సైతం జేబీ, కాంక్రీట్ ఇన్ఫ్రా సంస్థలు సొంతం చేసుకున్నాయన్నారు. ఈ భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నామని, దానికి సంబంధించిన అన్ని రకాల దస్తావేజులు తమ వద్ద ఉన్నాయన్నారు. సదరు సంస్థలు తమ భూముల్లోకి తమను పోనివ్వకుండా స్థానిక పోలీసుల సహకారంతో కబ్జా చేశారని, రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని వాపోయారు. వారి వెనుక ప్రస్తుత రంగారెడ్డి జిల్లా అధికార కాంగ్రెస్ పార్టీలోని ఓ ముఖ్యనేత ఉన్నాడని, తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని తెలిపారు. లక్ష్మమ్మ, హరికృష్ణ, మహేందర్, నర్సమ్మ పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

