వెక్కిరిస్తున్న పునాది రాళ్లు
రేవంత్ రెడ్డి సర్కార్ అట్టహాసంగా శంకుస్థాపన చేసిన పునాది రాళ్లు వెక్కిరిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా నిర్మించిన ప్రాజెక్టులను ఇప్పటివరకు ప్రారంభించగా.. రేవంత్ చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు అతీగతీ లేకుండా పోతున్నాయి.
- సీఎం రేవంత్ శంకుస్థాపన చేసిన రెండు ప్రాజెక్టులకు గ్రహణం
- ఎల్ అండ్ టీతో డీల్ ముగిస్తేనే పట్టాలెక్కనున్న మెట్రో రెండో దశ
- తాజాగా ఎలివేటెడ్ కారిడార్‌లోనూ భూసేకరణ మెలిక
- ఏడాదిన్నర దాక ఏమీ చేయలేమని చేతులెత్తేసిన సర్కార్!
సిటీబ్యూరో/జూబ్లీహిల్స్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): రేవంత్ రెడ్డి సర్కార్ అట్టహాసంగా శంకుస్థాపన చేసిన పునాది రాళ్లు వెక్కిరిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా నిర్మించిన ప్రాజెక్టులను ఇప్పటివరకు ప్రారంభించగా.. రేవంత్ చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు అతీగతీ లేకుండా పోతున్నాయి. ఇక ఎలివేటెడ్ ప్రాజెక్టు కోసం గతంలో బీఆర్ఎస్ సర్కార్ రక్షణ శాఖ నుంచి భూముల స్వాధీనానికి అహర్నిశలు కృషి చేసింది. అయితే చేతిలో చిల్లి గవ్వ లేకున్నా మెట్రో రెండో దశ విస్తరణ పేరిట రూ.45వేల కోట్ల డీపీఆర్‌ను కేంద్రానికి పంపిన రేవంత్ సర్కార్ ఇప్పుడు ప్రాజెక్టులను కట్టలేక చేతులు ఎత్తివేయడంతో ప్రచారం కోసం వేసిన శిలాఫలకాలు వెక్కిరిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఇప్పటివరకు ప్రారంభించిన ఏ ఒక్క ప్రాజెక్టు కూడా కాగితాలను దాటి కార్యరూపంలోకి తీసుకురాలేకపోయింది.
కొలిక్కిరాని మెట్రో విస్తరణ..
రూ.45వేల కోట్ల అంచనా వ్యయంతో నగరంలో 120 కిలోమీటర్ల రెండో దశ మెట్రో విస్తరణకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. శిలాఫలకం చెక్కిన మూడు నెలల్లోనే డీపీఆర్ రూపొందించి కేంద్రానికి అప్పగించారు. కానీ డీపీఆర్‌లో ఉన్న లోపాలు, ప్రస్తుతం నిర్వహణలో ఉన్న ఎల్ అండ్ టీ సమన్వయం, నిధుల సర్దుబాటు వంటి అంశాలపై అనుమతులు ఇవ్వలేదు. ముఖ్యంగా రెండో దశ విస్తరణ కోసం ఎల్ అండ్ టీతో అవగాహన ఒప్పందం ఉండాలనీ, లేదంటే అనుమతులు ఇవ్వలేమని తేల్చి చెప్పడంతో.. డీపీఆర్ అక్కడే మూలుగుతున్నది. తాజాగా పెరుగుతున్న అప్పుల భారం, ప్రభుత్వ వైఖరితో హైదరాబాద్ మెట్రో నిర్వహణ కష్టమేనని, ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఎల్అండ్టీ సంస్థ చేతులు ఎత్తివేసింది.
దీంతో గల్లాపెట్ట్టె ఖాళీగా ఉన్నా.. పెరిగే అప్పుల భారంపై స్పష్టత లేకుండానే మొత్తం రూ.15వేల కోట్లు చెల్లించేందుకు ఒప్పందం చేసుకుంది.ఈ క్రమంలో ఎల్ అండ్ టీకి చెల్లించాల్సిన డబ్బుల కోసం ఇప్పుడు ఆర్థిక సంస్థల వెంట పడుతున్నా రూపాయి పుట్టే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఈ వ్యవహారం తేలేంత వరకు ప్రాజెక్టు కోసం కేంద్రం అనుమతులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. అయితే ప్రభుత్వం మాత్రం ఈ ప్రాజెక్టును చేపడుతామంటూ బీరాలు పోతుందే తప్పా… ఇప్పటి వరకు ఒక్క అడుగు ముందుకు వేయలేదు. ఇదంతా పరిష్కారమయ్యేంత వరకు కనీసం ఏడాదిన్నర పట్టనుండగా.. కాగితాలపై రూపొందించిన విస్తరణ ప్రణాళికలన్నీ దుమ్ముకొట్టుకుపోతున్నాయి.
ఎలివేటెడ్‌పై సర్కార్ మెలిక..
రక్షణ శాఖ నుంచి భూముల సేకరణకు బీఆర్ఎస్ హయాంలో అహర్నిశలు కృషి చేసింది. నార్త్ సిటీ అభివృద్ధికి అనుగుణంగా డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్‌కు ప్రణాళికలు రూపొందించింది. అయితే తదనంతరం కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఎలివేటెడ్ కారిడార్‌కు గ్రహణం పట్టుకుంది. అధికారం చేపట్టిన మూడు నెల్లోనే ఈ ప్రాజెక్టుకు సీఎం రేవంత్ రెడ్డి అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. ఏడాదిన్నర గడిచినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది పరిస్థితి. 18 కిలోమీటర్ల మేర నిర్మించే ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా 1,500కు పైగా ఆస్తులను సేకరించాలని భూసేకరణ నోటిఫికేషన్ జారీచేసింది. కానీ ఇప్పటివరకు ఇంచు భూమిని కూడా సేకరించలేకపోయింది.
అయితే స్థానికుల డిమాండ్లను పట్టించుకోకపోవడంతో.. భూసేకరణ ఇప్పటివరకు కొలిక్కి రాలేదు. కనీసం బాధితులతో మాట్లాడకుండా, అక్రమ కేసులతో బెదిరింపులకు పాల్పడిందే తప్పా… ఏనాడు జూబ్లీ బస్ స్టేషన్ నుంచి శామీర్‌పేట్ వరకు, ప్యారడైజ్ నుంచి సుచిత్ర మార్గంలో నిర్మించే ఈ ప్రాజెక్టు కోసం కాంగ్రెస్ సర్కార్ చిత్తశుద్ధితో పనిచేయలేదు. దీంతో ప్రభుత్వ వైఖరికి నిరసనగా.. వందలాది భూ బాధితులు కోర్టులను ఆశ్రయించడంతో తాజా భూసేకరణ వ్యవహారం మరో ఏడాదిన్నర వరకు ముట్టుకోలేమని తేల్చి పక్కన పెట్టింది. దీంతో ఈ ప్రాజెక్టు కూడా అతీగతీ లేకుండా మిగిలిపోయింది.
నగరాభివృద్ధిని పట్టించుకోని కాంగ్రెస్..
బీఆర్ఎస్ సర్కార్ హయాంలో హైదరాబాద్ నగరం అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. విస్తృతమైన ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు, నాలా అభివృద్ధితో దూసుకుపోయింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో అమలు కానీ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నగరాభివృద్ధిని పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఇందులో ప్రధానమైనవి మెట్రో రెండో దశ విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్. దీనికి తోడు హైడ్రా వంటి వ్యవస్థను తీసుకువచ్చి నగరాభివృద్ధిని అయోమయంలో పడేశారని రియల్ వ్యాపారులు, ప్రజల నుంచి కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

