విదేశాలకు పారిపోతుండగా అరెస్ట్
శ్రీలక్ష్మి శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ నిర్వాహకురాలు గుర్రం విజయలక్ష్మి(48)ని దుండిగల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, మల్లంపేట్‌లోని సర్వే నం. 170/3, 170/4, 170/4/ఏకు సంబందించిన భూముల్లో విజయలక్ష్మి శ్రీలక్ష్మి కన్స్ట్రక్షన్స్, భావనాస్ జీఎల్సీ క్రిబ్స్ పేరుతో 2018లో వెంచర్‌ను ప్రాంభించారు.
- మల్లంపేట శ్రీలక్ష్మి శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ అధినేత గుర్రం విజయలక్ష్మి
- శంషాబాద్ విమానాశ్రంలో లేడీ రియల్డర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- మల్లంపేట్‌లో హైడ్రా కూల్చింది విజయలక్ష్మి నిర్మించిన విల్లాలే..
దుండిగల్, జనవరి 30: శ్రీలక్ష్మి శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ నిర్వాహకురాలు గుర్రం విజయలక్ష్మి(48)ని దుండిగల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, మల్లంపేట్‌లోని సర్వే నం. 170/3, 170/4, 170/4/ఏకు సంబందించిన భూముల్లో విజయలక్ష్మి శ్రీలక్ష్మి కన్స్ట్రక్షన్స్, భావనాస్ జీఎల్సీ క్రిబ్స్ పేరుతో 2018లో వెంచర్‌ను ప్రాంభించారు. ఇందులో 120, 150, 200, 300 గజాల వీస్తీర్ణంలో ప్రభుత్వ అనుమతుల పేరిట విల్లాలను నిర్మించి సుమారు 325 మంది కస్టమర్లకు విక్రయించింది. అయితే, బ్రోచర్లో పేర్కొన్నట్లుగా స్మిమ్మింగ్ పూల్, యోగా రూం, ఇండోర్, అవుట్ డోర్ స్టేడియాలను ఏర్పాటు చేస్తానని కస్టమర్ల వద్ద నుంచి వందల కోట్ల రూపాయలను వసూలు చేసింది. అయితే, సదరు విల్లాలలో వసతులు కల్పించకపోగా, కొనుగోలుదారులతో తరచు గొడవ పడుతుండేది.
కనీస వసతులైన తాగునీరు, మురుగునీటి తరలింపు, విద్యుత్ మీటర్ల వంటి వసతులను కల్పించడంలో విఫలమైంది. దీంతో కొనుగోలుదారులతో విజయలక్ష్మికి 2021 నుంచి వివాదం నడుస్తుంది. తమ వద్ద కోట్లాది రూపాయులు వసూలు చేసి కనీస వసతులు కల్పించడం లేదంటూ 2021లోనే కస్టమర్లు విజయలక్ష్మిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో విజయలక్ష్మి నిర్మించిన విల్లాలు మల్లంపేట్ – బౌరంపేట్ పరిధిలోని కత్వా చెరువు ఎఫ్టీఎల్/ బఫర్ జోన్లోకి వస్తున్నాయంటూ గత ఏడాది సెప్టెంబర్ 8వ తేదీన 17 విల్లాలను హైడ్రా నేలమట్టం చేసింది. దీంతో బాధితులతో పాటు హైడ్రా అధికారుల ఫిర్యాదు మేరకు విజయలక్ష్మిపై ఆర్థిక నేరానికి పాల్పడటం, నమ్మించి మోసగించడం, ప్రభుత్వ భూముల ఆక్రమణ, అక్రమ లే అవుట్ల సృష్టి వంటి పలు కేసులు ఆమెపై నమోదయ్యాయి.
అప్పటి నుంచి పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతుండటం. అమెరికాలో ఆమె భర్త శ్రీనివాస్, పిల్లలు అమెరికాలో ఉంటుండటంతో పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో విజయలక్ష్మి విదేశాలకు వెళ్లేందుకని శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోగా, ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెను గుర్తించి దుండిగల్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మేడ్చల్ ఏసీపీ బి.శ్రీనివాస్ రెడ్డి, సీఐ పి.సతీశ్, ఎస్ఐలు టి.శంకర్, ఎం.రాంమోహన్ రెడ్డి ఎయిర్ పోర్ట్‌కు చేరుకుని విజయలక్ష్మిని అదుపులోకి తీసుకుని దుండిగల్ పీఎస్‌కు తరలించారు. విచారణలో నేరాలను అంగీకరించడంతో వైద్య పరీక్షలు జరిపించిన పోలీసులు సాయంత్రం కోర్టులో హాజరుపర్చారు. జడ్జీ 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలో చర్లపల్లి జైలుకు తరలించారు.
పీఎస్‌కు భారీగా చేరుకున్న బాధితులు..
కాగా, లేడీ రియల్టర్ డాన్‌గా పేరు గాంచిన విజయలక్ష్మిని దుండిగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నా విషయం తెలుసుకున్న జీఎల్సీ భావనాస్ క్రిబ్స్కు చెందిన బాధితులు పెద్ద సంఖ్యలో దుండిగల్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. విజయలక్ష్మికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆమెను కఠినం గా శిక్షించాలన్నారు. విల్లాల పేరుతో తమను ఆర్ధికం గా మోసగించిందని వాపోయారు. పైసా పైసా కూడబెట్టుకుని విల్లాలు కొనుగోలు చేస్తే ఎటువంటి సౌకర్యాలు కల్పించకుండా విజయలక్ష్మి తమను పూర్తిగా మోసం చేసిందన్నారు. కేవలం రెండు స్లాబులు వేసి, తమ వద్ద పూర్తి డబ్బులు తీసుకుని మొఖం చాటేసిందని వాపోయారు. హైడ్రా విల్లాలు కూల్చే నాటికి రెండురోజుల ముందు సైతం కొందరికి విల్లాలు రిజిస్ట్రేషన్ చేసిందని, సంపాదించుకున్నదంతా దోచుకున్న విజయలక్ష్మి నుంచి తమకు న్యాయం చేయాలన్నారు. తమ వద్ద సుమారు రూ.300 పైచిలుకు కోట్ల వరకు మోసం చేసిందన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
Hyderabad | పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై యాక్సిడెంట్.. ఒకదానికొకటి ఆరు కార్లు ఢీ
Tesla Flying Car: టెస్లా ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. గాలిలో పల్టీలు కొట్టి.. సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్ 2.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

