జియాగూడ, మే 14 : 30 ఏండ్లుగా పాత పోలీస్ క్వార్టర్స్‌లో కుల్సుంపురా పోలీస్‌స్టేషన్ భవనంలో కొనసాగుతుంది. ప్రభుత్వం కొత్త పోలీస్స్టేషన్ల ఏర్పాటు చేయడంతో కుల్సుంపురా పోలీసుస్టేషన్ భవనం అత్యధునిక మోడల్ పోలీస్‌స్టేషన్‌గా రూపుదిద్దుకుంటుంది. రూ. 4. 26 కోట్ల వ్యయంతో పాత పోలీస్‌స్టేషన్ పక్కనే పోలీస్ క్వార్టర్స్‌లోని స్థలంలో భవన నిర్మాణం పనులు పూర్తయ్యాయి. భవనంలో సీసీ కెమెరాల పర్యవేక్షణ గది, ఫిర్యాదుల కోసం వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా సౌకర్యాల ఏర్పాటు, కౌన్సెలింగ్ రూమ్‌లు, టాయిలెట్లు, తాగునీటి సౌకర్యం, మీటింగ్ హాల్స్, మెన్ బ్యారేక్, బందోబస్తు కోసం వచ్చే పోలీసు సిబ్బందికి గదులు, పోలీసు సిబ్బందికి అప్‌గ్రెడ్ కోసం ట్రైనింగ్ హల్స్, అధికారులకు విశ్రాంతి భవనాలు ఏర్పాటు చేశారు. స్టేషన్ ఆవరణలో గ్రీనరీ పనులు సకల హంగులతో నూతన భవనం అందుబాటులోకి రానున్నది.
మెహిదీపట్నం, మే 14 : ప్రజలకు ఉత్తమ పోలీస్ సేవలు అందించడానికి ప్రభుత్వం ఆధ్వర్యంలో పోలీస్ ఉన్నతాధికారులు పోలీస్ స్టేషన్ల భవనాలను ఆధునీకరించి అందుబాటులోకి తెస్తున్నారు. పాత భవనాలను తొలగించి ఆధునిక హంగులతో భవనాలను నిర్మిస్తున్నారు. ఆసిఫ్‌నగర్ డివిజన్లో గోల్కొండ, ఆసిఫ్‌నగర్, టప్పాచబుత్ర పోలీస్ స్టేషన్ల భవనాలను నూతనంగా నిర్మించి అందుబాటులో ఉంచిన నగర పోలీస్ ఉన్నతాధికారులు ఇప్పుడు హుమాయూన్‌నగర్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. మెహిదీపట్నం ప్రధాన చౌరస్తా సమీపంలో నూతనంగా నిర్మించిన భవనాన్ని హోంమంత్రి మహ్మద్ మహమూద్ అలీ సోమవారం తెలంగాణ డీజీపీ అంజనీకుమార్, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌లతో కలిసి ప్రారంభించనున్నారు.
నాలుగు అంతస్తుల్లో నూతన భవనం..
హుమాయూన్‌నగర్ పోలీస్ స్టేషన్ నూతన భవనంలో నాలుగు అంతస్తులు విశాలంగా నిర్మించారు. మొదటి అంతస్తులో ఇన్స్పెక్టర్, ఎస్సైల గదులు ,లాకప్ గది, రిసెప్షన్, రెండో అంతస్తులో నేర విభాగం, మూడో అంతస్తులో పోలీస్ సిబ్బంది విశ్రాంతి గదులు, నాలుగో అంతస్తులో యోగా కేంద్రం, జిమ్ ఉంటాయి.
సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ..
పోలీస్‌స్టేషన్ నూత భవన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హోం మంత్రి మహ మూద్ అలీ, సినిమాట్రోగ్రఫీ శాఖ మంత్రి తలసాని , డీజీపీ అంజనీకుమార్, నగర పోలీస్ కమిషనర్ సీవీ అనంద్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మోహినుద్దీన్, కార్పొరేటర్ బోయిని దర్శన్ సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు హాజరై ప్రారంభించనున్నారు.
–టి. అశోక్‌కుమార్, కుల్సుంపురా ఇన్స్పెక్టర్
ఉత్తమ సేవలు అందిస్తాం
ప్రజలకు అందుబాటులో ఉండి ఉత్తమ సేవలు అందిస్తాం. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాలతో శాంతి, భద్రతలను పరిరక్షిస్తాం. నూతన భవనంలో సేవలు అందించడానికి అన్నీ సిద్ధం చేశాం.నగరంలోని సున్నిత ప్రాంతాల్లో ఒకటైన హుమాయూన్‌నగర్‌లో సిబ్బందిని సమన్వయ పరుస్తూ ఉత్తమ పోలీసింగ్‌ను అమలు చేస్తాం.
–కె.నారాయణరెడ్డి , ఇన్స్పెక్టర్, హుమాయూన్ నగర్