ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు.. పురోగతి నిల్
కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి ప్రాజెక్టుల పరిస్థితి దారుణంగా మారింది. అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడుస్తున్నా... ప్రాజెక్టుల్లో పురోగతి లేకుండా పోయింది.
- ముందుకు కదలని కొత్వాల్‌గూడ ఏకో పార్క్ నిర్మాణం
- పర్యావరణ, పర్యాటక కేంద్రంగా మారనున్న జంట జలాశయాలు
- 2022లోనే ప్రారంభించిన కేసీఆర్ సర్కార్
- ఎన్నికలతో ఆగిపోయిన పనులను ఇప్పటికీ మొదలెట్టని హెచ్ఎండీఏ
- కొత్వాల్‌గూడ ఏకో పార్క్ నిర్లిప్తతపై కేటీఆర్ ట్వీట్
సిటీబ్యూరో, జూలై 10(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి ప్రాజెక్టుల పరిస్థితి దారుణంగా మారింది. అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడుస్తున్నా… ప్రాజెక్టుల్లో పురోగతి లేకుండా పోయింది. కోట్లు వెచ్చించి గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను పూర్తయ్యేలా చూడాల్సిన ప్రస్తుత ప్రభుత్వం వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పటికీ ఓపెన్ ఎయిర్ థియేటర్, ఎంట్రెన్స్ ఆర్చ్, ఓపెన్ ప్లాజా, అప్రోచ్ రోడ్డు, ల్యాండ్ స్కేపింగ్, గ్రీనరి వంటి పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్రభుత్వం పెండింగ్ పనులపై దృష్టి సారించకపోవడంతోనే ఎన్నికలు ముగిసి ఏడు నెలలు గడుస్తున్నా… ప్రాజెక్టుల్లో మిగిలిపోయిన పనులు మొదలు కావడం లేదు.
అయితే గత ప్రభుత్వం ఎంతో వేగంగా పనులు పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించిన హెచ్ఎండీఏ అధికారులు… 2022 లో ప్రారంభించిన ఏడాదిలోనే మెజార్టీ పను లు పూర్తి చేసింది. కానీ మిగిలిపోయిన పనులను పూర్తి చేసేందుకు ఇప్పటికీ టెండర్ల ప్రక్రియ పూర్తి చేయలేకపోయారు. కాగా కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులపై నీలినీడలు కమ్ముకోవడంపై కేటీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరానికి చారిత్రక నేపథ్యం ఉన్న జంట జలాశయాలకు సమీపంలో ఏకో టూరిజాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రాజెక్టును ఇప్పటికైనా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఎక్స్‌లో పేర్కొన్నారు.
పర్యాటకానికి పెద్ద పీట వేస్తూ అత్యాధునిక పర్యాటక కేంద్రంగా కొత్వాల్‌గూడలోని కొండ లు, గుట్టల సమీపంలో కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నగరానికి పర్యాటక వన్నె తెచ్చేలా చేపట్టిన ఈ ప్రాజెక్టుతో హైదరాబాద్ ప్రతిష్ట మరింత పెరగనుంది. కోట్ల రూపాయల నిధులతో పచ్చని పరిసరాలు, అతిపెద్ద పక్షిశాల, అక్వేరియంతోపాటు వినోద కేంద్రం గా తీర్చిదిద్దేలా సన్నాహాలు చేసింది. 75 శాతానికి పైగా అప్పటి ప్రభుత్వం పనులు పూర్తి చేస్తే మిగిలిపోయిన 25 శాతం పనులకు ఇంకా మోక్షం కలగలేదు. దీంతో కోట్లు వెచ్చించి నిర్మించిన ప్రాజెక్టులను పట్టించుకోకపోవడం తో ప్రజాధనం వృథా అవుతుందని నగరవాసులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వాలు మారినంత మాత్రాన నగర పర్యాటకానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చే ఈ ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయడం లేదంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కొత్వాల్‌గూడ్ ఏకో పార్క్ విషయంలో హెచ్ఎండీఏ అధికారులను సన్నద్ధం చేయాలని, పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.
కాంగ్రెస్ నిర్లక్ష్యం పై కేటీఆర్ అసంతృప్తి
తమ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఒకటైన కొత్వాల్‌గూడ ఏకో పార్క్ నిర్మాణంలో కమ్ముకున్న నీలినీడలపై పురపాలక శాఖ మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్‌లో అసంతృప్తి వ్యక్తం చేశారు. దాదాపు 125 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబోయే ఐవరీ, అక్వేరియం, బోర్డు వాక్స్, ల్యాండ్ స్కేపింగ్, వీకెండ్ క్యాపింగ్ వంటి అభివృద్ధి పనులతో ఈ ప్రాంతం పర్యాటకం అభివృద్ధి చెందుతుందన్నారు. తమ ప్రభుత్వం ప్రారంభించి, పూర్తి చేసిన పనులు ఇప్పటికీ అలానే ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ తీసుకుని హైదరాబాద్ నగరవాసులు కుటుంబంతో సహా ఆస్వాదించే ఏకో టూరిజం కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలంటూ ఎక్స్‌లో కోరారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Eko Park
- hmda
- KCR govt
- Kotwalguda
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

