ఆ ప్రదేశం ఎక్కడంటే..? కేటీఆర్ ట్వీట్
minister ktr | టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ట్విట్టర్ పేజీలో ఓ ఫోటోను షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రదేశం ఎక్కడ ఉందో గెస్ చేయగలరా? అని నెటిజన్లను కేటీఆర్ ప్రశ్నించారు. ఆ
Minister KTR | టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ట్విట్టర్ పేజీలో ఓ ఫోటోను షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రదేశం ఎక్కడ ఉందో గెస్ చేయగలరా? అని నెటిజన్లను కేటీఆర్ ప్రశ్నించారు. ఆ ట్వీట్‌పై నెటిజన్ల నుంచి మంచి స్పందన వచ్చింది. అది గండిపేట పార్కు అని కొందరు ట్వీట్ చేయగా, ఇంకొందరేమో ఇది పక్కా తెలంగాణలోనే ఎక్కడో ఒక చోట ఉంటుందని పేర్కొన్నారు. మెజార్టీ నెటిజన్లు అయితే ఆ ఫోటోను చూసి గండిపేట లేక్ పార్కు అని గెస్ చేశారు.
ఆ ట్వీట్‌పై కేటీఆర్ ఇవాళ స్పందించారు. అదేక్కడో కాదు.. సమాధానం వచ్చేసి హైదరాబాద్‌కు సమీపంలోని గండిపేట లేక్ పార్కు అని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. గతంలోనూ కేటీఆర్ టీ హబ్, పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ లాంటి చిత్రాలను షేర్ చేసి.. వాటి ప్రత్యేకతలు, అవి ఎక్కడ ఉన్నాయో గెస్ చేయగలరా? అని ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
Answer is Gandipet Lake Park, Hyderabad 😊 https://t.co/Zt22VInand
— KTR (@KTRTRS) November 4, 2022
పర్యాటకులకు కనువిందు చేసేలా గండిపేటలో 18 ఎకరాల విస్తీర్ణంలో హెచ్ఎండీఏ రూ.35.6 కోట్లు వెచ్చించి సర్వాంగ సుందరంగా నందనవనాన్ని నిర్మించింది. ఈ పార్కును మంత్రి కేటీఆర్ ఇటీవలే ప్రారంభించారు. ఫ్లవర్ టెర్రస్, పిక్నిక్ స్పెసెస్, ఓపెన్ ఎయిర్ థియేటర్, ఆర్ట్ పెవిలియన్ వంటి ప్రత్యేకతలతో రూపుదిద్దుకున్న ఈ పార్కుతో గండిపేట తీర ప్రాంతమంతా.. అద్భుత పర్యాటక కేంద్రంగా మారింది. అదేవిధంగా సెంట్రల్ పెవిలియన్, టికెటింగ్ కౌంటర్లు, ఎంట్రెన్స్ ప్లాజా, వాక్‌వేస్, ఆర్ట్ పెవిలియన్, ప్లవర్ టెర్రస్, పిక్నిక్ స్పేస్, ఓపెన్ ఎయిర్ థియేటర్, ఇన్నర్ యాక్సెస్ రోడ్డు, కిడ్స్ ప్లే ఏరియా, ఫుడ్ కోర్టులను ఆకట్టుకునేలా చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

