వేర్వేరు బ్లడ్ గ్రూప్ వ్యక్తుల మధ్య విజయవంతంగా కిడ్నీ మార్పిడి

హైదరాబాద్ : రెండు వేర్వేరు బ్లడ్ గ్రూప్‌లు కలిగిన వ్యక్తుల మధ్య కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సను కృష్ణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(కిమ్స్) వైద్యులు విజయవంతంగా పూర్తిచేశారు. ఇది అవయవ అనుకూలత ఆందోళనను పరిష్కరించే సామర్థ్యంగా, అనేక మంది ప్రాణాలను రక్షించడంలో సహాయపడుతుంది.
అసోం నివాసి అషిమ్ దాస్(40)కు తన భార్య నుండి వైద్యులు లైవ్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీని చేశారు. అయితే అషీమ్ దాస్ బ్లడ్ గ్రూప్ ‘బి పాజిటివ్’ కాగా అతని భార్య బ్లడ్ గ్రూప్ ‘ఎ పాజిటివ్’. వేర్వేరు రక్త గ్రూప్‌ల మధ్య అవయవ మార్పిడి చాలా సంక్లిష్టమైనది. ఎందుకంటే దాత అవయవాన్ని తిరస్కరించే ప్రతిరోధకాలు పూర్తిగా తొలగించబడాలి లేదా మార్పిడికి ముందు నిద్రాణమై అయినా ఉండాలి. ప్లాస్మాఫెరెసిస్ అనే ప్రక్రియ ద్వారా ప్రతిరోధకాలను తటస్తం చేయడానికి మందులు ఇస్తూ రోగిలో ప్రతిరోధకాలను క్రమంగా తగ్గించగలిగినట్లు వైద్యులు తెలిపారు.
ఈ ప్రక్రియకు దాదాపు రెండు వారాల సమయం పట్టిందని కిమ్స్ హాస్పిటల్స్ నెఫ్రోలాజిస్ట్, శస్త్ర చికిత్సలో పాల్గొన్న వైద్యుడు డాక్టర్ రవి చెప్పారు. కిమ్స్‌లో చీఫ్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ సర్బేశ్వర్ సహారాయ్య ఈ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీని చేశారు. రోగులు శస్త్రచికిత్స నుండి కోలుకుని ఎటువంటి సమస్యలు లేకుండా డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rats | ఎలుకలను తరిమేయాలంటే రసాయన మందులే అక్కర్లేదు.. ఇంటి దగ్గర ఈ మొక్కలు పెంచండి!
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

