ప్రైవేట్‌కు మరిన్ని క్రీడా మైదానాలు ..!
పేద, మధ్య తరగతి పౌరులకు క్రీడలు దూరం కానున్నాయి. ఊహించినట్టుగానే ప్రజా సౌకర్యాల కంటే ప్రైవేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చే అంశాలకే కమిటీ సభ్యులు ప్రాధాన్యత ఇచ్చారు. క్రీడా మైదానాల నుంచి శ్మశాన వాటికల వరకు అన్నింటినీ ప్రైవేట్ ఏజెన్సీలకు కట్టబెట్టేందుకు కమిటీ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కేపీహెచ్‌బీ కాలనీ (5వ ఫేజ్)లోని క్రికెట్ ప్రాక్టీస్ పిచ్‌ల నిర్వహణకు నెలకు రూ. 59,639 బేస్ ప్రైస్‌తో ఈవోఐ ఆహ్వానించనున్నారు.
- నారపల్లి ఫె్లైఓవర్కు ‘బండారి రాజిరెడ్డి’ పేరు ప్రతిపాదన
- 20 ప్రతిపాదనలకు స్టాండింగ్ కమిటీ ఆమోదం
- మేయర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు
సిటీబ్యూరో, ఫిబ్రవరి 9 ( నమస్తే తెలంగాణ) : పేద, మధ్య తరగతి పౌరులకు క్రీడలు దూరం కానున్నాయి. ఊహించినట్టుగానే ప్రజా సౌకర్యాల కంటే ప్రైవేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చే అంశాలకే కమిటీ సభ్యులు ప్రాధాన్యత ఇచ్చారు. క్రీడా మైదానాల నుంచి శ్మశాన వాటికల వరకు అన్నింటినీ ప్రైవేట్ ఏజెన్సీలకు కట్టబెట్టేందుకు కమిటీ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కేపీహెచ్‌బీ కాలనీ (5వ ఫేజ్)లోని క్రికెట్ ప్రాక్టీస్ పిచ్‌ల నిర్వహణకు నెలకు రూ. 59,639 బేస్ ప్రైస్‌తో ఈవోఐ ఆహ్వానించనున్నారు. కేపీహెచ్‌బీ (9వ ఫేజ్)లోని ఇండోర్ షటిల్ కోర్టు నిర్వహణ ఫీజును 15 శాతం పెంచి, నెలకు రూ. 59,513గా ఖరారు చేసి ప్రతిపాదించారు.
బాలానగర్ ఫ్లై ఓవర్ కింద ఖాళీ స్థలాన్ని ఏడాది పాటు స్పోర్ట్స్ ఎరీనాగా మార్చనున్నారు. అలాగే నెక్సస్ మాల్ ఫ్లై ఓవర్ కింద ఉన్న స్పోర్ట్స్ ఎరీనా నిర్వహణకు నెలకు రూ. 1.14 లక్షల బేస్ ప్రైస్‌తో టెండర్లు పిలించేందుకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో మేయర్ అధ్యక్షతన 12వ సాధారణ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎజెండాలోని 9 ప్రధాన అంశాలతో పాటు మరో 11 అదనపు అంశాలకు కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.
కీలక నిర్ణయాలు ఇవే..
ఉప్పల్ నుంచి నారపల్లి వరకు ఉన్న ఎలివేటెడ్ కారిడార్‌కు ‘బండారి రాజిరెడ్డి కారిడార్’గా పేరు పెట్టాలని నిర్ణయించి, తుది అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు.
- ఆనంద్‌నగర్-మన్సూరాబాద్, ప్రియదర్శిని పార్ నుంచి కోణార్ డయాగ్నోస్టిక్స్ మార్గాల్లో రోడ్డు వెడల్పు పనులకు, ఆస్తుల సేకరణకు ఆమోదం తెలిపారు. అల్వాల్ లోని లక్ష్మీనగర్ లో బాక్స్ డ్రైన్ నిర్మాణం, సఫిల్‌గూడ నడిమి చెరువు అభివృద్ధి పనుల ద్వారా వరద నీటి సమస్యకు శాశ్వత పరిషారం చూపనున్నారు.
- మూసాపేట, నాచారం (ఎర్రకుంట) ప్రాంతాల్లో శ్మశాన వాటికలను ఆధునిక వసతులతో కూడిన వైకుంఠధామాలుగా అభివృద్ధి చేయనున్నారు.
- హెచ్ఎంటీ నగర్లో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, బీరప్పగూడలో బహుళ అంతస్తుల భవనం, కాప్రా సరిల్లో పారుల అభివృద్ధి పనులకు అనుమతులు లభించాయి.
- అదనపు కమిషనర్ల అధికారాలకు సంబంధించి కమిషనర్ తీసుకున్న నిర్ణయాలను కమిటీ ధ్రువీకరించింది. ఈ సమావేశంలో బల్దియా కమిషనర్ కర్ణన్, స్టాండింగ్ కమిటీ సభ్యులు బొంతు శ్రీదేవి, బానోతు సుజాత, మిన్హాజుద్దీన్, సమీనా బేగం, వాహెబ్, పర్వీన్ సుల్తానా, సలీం, డా.ఆయేషా హుమేరా, జబీన్, మహాలక్ష్మి రామన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

