వందేండ్ల అభివృద్ధి.. పదేండ్లలోనే.. విశ్వనగరంలో ప్రగతి పతాక రెపరెపలు
పెట్టుబడులకు స్వర్గధామంగా హైదరాబాద్.. కేసీఆర్ దార్శనికత.. గ్లోబల్ సిటీగా ఆవిష్కరణ.. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో విరాజిల్లిన నగర ఖ్యాతి.. ప్రపంచపటంలో ప్రథమ స్థానంలో నిలిపిన సమగ్రాభివృద్ధి.. ఐటీ రంగం పరుగులు..వెల్లువలా ఉపాధి అవకాశాలు
సిటీబ్యూరో,(నమస్తే తెలంగాణ) : తెలంగాణ స్వరాష్ట్రంలో హైదరాబాద్ మహానగరాన్ని కేసీఆర్ దార్శనికత గ్లోబల్ సిటీగా మార్చింది. యువ మంత్రి కేటీఆర్ సారథ్యంలో ఐటీ రంగం జెట్ స్పీడ్‌లో దూసుకుపోయింది. డాటా సెంటర్లు, ప్రపంచ స్థాయి కార్పొరేట్ ఐటీ కంపెనీలకు కేంద్రంగా మారింది. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షిస్తూ.. పరిశ్రమలకు స్వర్గధామంగా మారి.. మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నది. వరల్డ్ క్లాస్ రహదారులు, ఫ్లెఓవర్లు, అండర్ పాస్‌లు, దూరభారాన్ని తగ్గించే లింకు రోడ్లు, అందమైన చెరువులు, సామాన్యుడు గర్వపడేలా ఫంక్షన్ హాళ్లు.. పేదల కడుపునింపే అన్నపూర్ణ క్యాంటీన్లు.. బస్తీ దవాఖానలు.. సమృద్ధిగా తాగునీళ్లు.. నిరంతరం విద్యుత్ వెలుగులతో నగరం రూపురేఖలు సమూలంగా మారి పదేండ్లలో అద్భుత భాగ్యనగరం ఆవిషృతమైంది.
యువతకు ఉద్యోగ, ఉపాధిలో ముందంజ
ఐటీ మంత్రి కేటీఆర్ చొరవతో టీహబ్, వీహబ్, టీ శాట్ వంటి స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించే సంస్థలను నెలకొల్పారు. వీటి ద్వారా ఎంతో మంది యువ పారిశ్రామిక వేత్తలు అవతరించారు. ఇక్కడి స్టార్టప్ కంపెనీలకు విదేశాల నుంచి పెట్టుబడులు వెల్లువలా వచ్చాయి. ఆన్లైన్ డెలివరీ వ్యవస్థ అత్యంత వేగంగా విస్తరించింది. లక్షలాది మంది యువత గిగ్ వర్కర్లుగా ఉపాధి పొందుతున్నారు. అదేవిధంగా అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలకు హైదరాబాద్ కేంద్రంగా మారింది. దీంతో బహుబాషల్లో ప్రావీణ్యం పొందిన యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాయి.
ట్రీ సిటీ ఆఫ్ వరల్డ్
నగర ప్రజలకు చకటి వాతావరణం కల్పించి, జీవన ప్రమాణాలను పెంపొందించుటకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. వివిధ ప్రాంతాల్లో పార్కులను అభివృద్ధి చేయడంతో పాటు ఖాళీ స్థలాల్లో యాదాద్రి మోడల్ మియావాకి, వర్టికల్ , థీమ్ పార్కులు, మెరిడియన్స్ , అవెన్యూ ప్లాంటేషన్ , జంక్షన్ల సుందరీకరణ, ట్రీ పార్కుల వంటివి ప్రారంభించారు. ఎఫ్‌ఎస్‌ఐతో పాటు అర్బోర్ డే ఫౌండేషన్ సంస్థ, ఎఫ్ ఏఓ (ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ యూఎన్ ) సంస్థలు 2020 సంవత్సరానికి గాను హైదరాబాద్ నగరాన్ని ట్రీ సిటీ ఆఫ్ వరల్డ్ గా గుర్తించాయి. 63 దేశాలకు చెందిన 119 పట్టణాలు, నగరాలు ఈ పోటీలో పాల్గొనగా హైదరాబాద్ నగరం ట్రీ సిటీ ఆఫ్ వరల్డ్ ఘనత సాధించింది. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ మహానగర పరిధిలో 147 శాతం అటవీ విస్తీర్ణం పెంచారు. గతంలో 33.15 చ.కి.మీ. అటవీ విస్తీర్ణం ఉండగా.. హరితహారం వల్ల అది 81.81 చ.కి.మీ.లకు పెరిగినట్లు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించారు.
మారిన రహదారుల రూపురేఖలు
స్ట్రాటజిక్ రోడ్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం (ఎస్ ఆర్ డీపీ) నగర ట్రాఫిక్ వ్యవస్థ రూపురేఖలను మార్చేసింది. నాలుగు ఫె్లై ఓవర్లు కట్టి నగరాన్ని ప్రపంచపటంలో పెట్టామని డబ్బాలు కొట్టుకున్న సమైక్య పాలకులకు భిన్నంగా మౌలిక వసతుల కల్పనలో మొకవోని దీక్షతో పరుగులు పెట్టించి పాలనలో తనదైన ముద్ర వేసుకున్నది. ఇందులో భాగంగానే సిగ్నల్ రహిత ప్రయాణమే లక్ష్యంగా ప్రభుత్వం రూ.5112.36 కోట్ల అంచనా వ్యయంతో 48 ప్రాజెక్టులు చేపట్టింది. ఇందులో 18 ఫ్లైఓవర్లు, ఐదు అండర్ పాస్ లు, ఏడు ఆర్వోబీ/ఆర్ యూబీలు, కేబుల్ బ్రిడ్జి, మరో 3 ఇతర పనులను పూర్తి చేశారు.
వీటి వల్ల బంజారాహిల్స్ , జూబ్లీహిల్స్ , హైటెక్ సిటీ, కూకట్ పల్లి, బాచుపల్లి, పటాన్ చెరువు, అబిడ్స్ , చార్మినార్ , ఎల్బీనగర్ , చాంద్రాయణగుట్ట, శంషాబాద్ ఎయిర్ పోర్టు, ఉప్పల్ , సికింద్రాబాద్ , ఈసీఐఎల్ , అల్వాల్ , కొంపల్లి, జీడిమెట్ల కారిడార్ లో ట్రాఫిక్ సమస్యకు పరిషారం లభించింది. మిగిలిన 14 ప్రాజెక్టులు 99 శాతం పూర్తి చేశారు. వాటికి నేటి కాంగ్రెస్ ప్రభుత్వం రిబ్బన్ కట్ చేసి తమ ఖాతాలో వేసుకుంది.
సుభిక్షంగా నగర జనజీవనం
గ్రేటర్ హైదరాబాద్ పౌరులకు అన్ని రకాల ప్రపంచ స్థాయి వసతులు కల్పించారు. ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న ప్రభుత్వం.. నగరంలోని వివిధ ప్రాంతాల్లో నివసించే పేద ప్రజల ఆరోగ్యం సురక్షితం చేయాలనే సంకల్పంతో బస్తీ దవాఖానలను ఏర్పాటు చేశారు. పాదచారుల భద్రత, ప్రమాదాల నివారణ కోసం 8 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. కాలనీ వాసులకే కాకుండా పాదచారులు, సీనియర్ సిటిజన్ లకు ఎంతో ఉపయోగ పడుతున్నాయి. మదీనాగూడ, మియాపూర్ , పంజాగుట్ట, బాలానగర్ , సికింద్రాబాద్ , రాజేంద్రనగర్ , నేరెడ్ మెట్ బస్టాండ్ , ఈఎస్ఐ హాస్పిటల్ ఎర్రగడ్డలో ఇవి అందుబాటులోకి వచ్చాయి.
ప్రైవేటు ఫంక్షన్ హాళ్ల కంటే సకల సౌకర్యాలు కల్పించి పేదల హృదయాల్లో ఆనందం నింపడం కోసం సకల హంగులతో పలు ప్రాంతాల్లో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్‌కు శ్రీకారం చుట్టింది. రూ.95.70 కోట్ల అంచనా వ్యయంతో 25 మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్లు చేపట్టగా అందులో రూ.30.10 కోట్ల వ్యయంతో 9 పనులు పూర్తి చేసుకుని అందుబాటులోకి తీసుకువచ్చారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ నిర్వహణలో జీహెచ్ఎంసీ 100 శాతం పకడ్బందీగా చర్యలు చేపడుతున్నది. నగరంలో ప్రతిరోజు 6 వేల మెట్రిక్ టన్నుల మున్సిపల్ వ్యర్థాలు వస్తున్నాయి. వీటిని 4,500 స్వచ్ఛ ఆటోల ద్వారా ఇంటింటి నుంచి సేకరిస్తున్నారు. కమర్షియల్ ప్రాంతాల ప్రధాన రహదారుల్లో వచ్చే చెత్తను ట్రాన్స్ ఫర్ స్టేషన్లకు తరలించి శాస్త్రీయ పద్ధతిలో వ్యర్థాల నిర్వహణ చేపడుతున్నారు.
మౌలిక వసతుల్లో మేటి…
ఉమ్మడి పాలన నుంచి విముక్తి పొంది స్వరాష్ట్రంగా అవతరించాక కేసీఆర్ పదేండ్ల పాలన స్వర్ణయుగంగా మారింది. హైదరాబాద్ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చింది. ఐటీ కారిడార్‌తో ఉద్యోగ ఉపాధి కల్పనకు కేర్ ఆఫ్‌గా మారిపోయింది. ఉద్యోగాలు రెండింతలు పెరిగితే.. ఎగుమతులు మూడింతలు పెరిగాయి. 2014 నాటికి ఐటీ ఉద్యోగాలు 3,71,774 ఉంటే 2023 నాటికి 7,78,121 మందికి ఐటీ ఉద్యోగాలు దకాయి. పదుల సంఖ్యలో ఉన్న ఐటీ వందలుగా విస్తరించి హైదరాబాద్ ను ఐటీ రాజధానిగా మార్చాయి. ఐటీ కారిడార్ లో మౌలిక వసతులకు పెద్ద పీట వేసింది. మాదాపూర్ , రాయదుర్గం, గచ్చిబౌలి ప్రాంతాలను కలిపే మైండ్ స్పేస్ జంక్షన్లో ఫె్లై ఓవర్ తో పాటు అండర్ పాస్ ను నిర్మించింది.
నగరంలోని ఐటీ, ఉద్యోగులు ఎక్కువగా ఉండే ప్రాంతాలను ఔటర్ రింగు రోడ్డుకు లింక్ చేశారు. ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు ఎక్కడికక్కడ ఫె్లై ఓవర్లు నిర్మించారు. మొత్తంగా 10 ఏళ్లలోనే రాష్ట్రంలో ఐటీ ముఖ చిత్రం మారిపోయింది. ఆకలితో ఏ ఒకరూ అలమటించకూడదన్న సీఎం కేసీఆర్ సంకల్పంతో అన్నపూర్ణ పథకం ద్వారా 5 రూపాయలకే కోట్ల మందికి పైగా భోజనం అందించారు. 2014 మార్చి 1న 8 కేంద్రాలతో ప్రారంభమై.. ఇప్పుడు 150కి చేరింది. ప్రతిరోజూ గ్రేటర్ పరిధిలో 45 వేల మంది అన్నపూర్ణ భోజనాలు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Global City
- Hyderabad
- IT Sector
- KCR
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

