GHMC Park | జీహెచ్ఎంసీ పార్కులో ఆక్రమణలు తొలగినా.. నిర్వహణపై అధికారుల మౌనం
GHMC Park | ‘నమస్తే తెలంగాణ’ కథనాలతో జీహెచ్ఎంసీ పార్కులో ప్రైవేటు వ్యక్తులు చేసిన నిర్మాణాలను హైడ్రా అధికారులు తొలగించి సుమారు 20 రోజులు గడిచాయి. మూడున్నర ఎకరాల పార్కు స్థలంలో 70 శాతం స్థలాన్ని ఇద్దరు బడాబాబులు చెరబట్టిన సంగతి తెలిసిందే.
- ఆక్రమణలు తొలగినా..అంతే మారని జూబ్లీహిల్స్ పార్కు దుస్థితి
- మంత్రి వియ్యంకుడి ఒత్తిడే కారణమా?
GHMC Park | బంజారాహిల్స్, ఫిబ్రవరి 4 : జూబ్లీహిల్స్ రోడ్ నం.32లోని సుమారు రూ.300 కోట్ల విలువైన జీహెచ్ఎంసీ పార్కులో ఆక్రమణలు తొలగినా యూబీడీ విభాగం అధికారులు మాత్రం నిర్వహణపై దృష్టి పెట్టడం లేదు. ‘నమస్తే తెలంగాణ’ కథనాలతో జీహెచ్ఎంసీ పార్కులో ప్రైవేటు వ్యక్తులు చేసిన నిర్మాణాలను హైడ్రా అధికారులు తొలగించి సుమారు 20 రోజులు గడిచాయి. మూడున్నర ఎకరాల పార్కు స్థలంలో 70 శాతం స్థలాన్ని ఇద్దరు బడాబాబులు చెరబట్టిన సంగతి తెలిసిందే.
పార్కును అభివృద్ధి చేస్తున్నామనే నెపంతో రెండు తెలుగు రాష్ర్టాల్లోనే అత్యంత ప్రముఖమైన విద్యాసంస్థలకు చెందిన యజమాని పార్కులోని దక్షిణ భాగంలో సుమారు ఎకరన్నర స్థలాన్ని ఫామ్‌హౌస్ తరహాలో తయారు చేసుకున్న వైనంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అదే విధంగా పార్కులోని తూర్పు వైపు సైతం రాష్ట్ర ప్రభుత్వంలోని ఓ మంత్రి వియ్యంకుడు సుమారు ఎకరం స్థలాన్ని సొంతానికి వాడుకోవడంతో పాటు ఏకంగా సర్వెంట్స్ కోసం గదులు నిర్మించగా, వాటిని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో కూల్చేశారు. మంత్రికి చెందిన వియ్యంకుడు నిర్మించిన సర్వెంట్స్ రూమ్స్‌ను కూడా కూల్చేశారు. అయితే తమ బంగ్లాలనుంచి పార్కులోకి వచ్చేందుకు ఏర్పాటు చేసిన గేట్లను తొలగించాలని, అక్కడ గోడ నిర్మించాలంటూ హైడ్రా అధికారులు యూబీడీ విభాగం అధికారులను ఆదేశించినా ఇప్పటిదాకా ఆ పనిచేయలేదు.
కనీసం రోజువారీ క్లీనింగ్ పనులు, మొక్కలకు నీళ్లు పోసే పనులు సైతం ప్రారంభించలేదు. మంత్రిగారి వియ్యంకుడి ఒత్తిడితోనే పార్కు నిర్వహణ జోలికి రావడంలేదని, పార్కు స్థలాన్ని మరోసారి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలున్నాయి. ఖరీదైన జీహెచ్ఎంసీ పార్కును అన్యాక్రాంతం కాకుండా చూడాలని, తక్షణమే జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు స్పందించి పార్కు నిర్వహణను గాడిలో పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Read Also :
GHMC | జీహెచ్ఎంసీలో ప్రైవేట్ ఏజెన్సీల అక్రమాలు.. అడ్డదారిలో పనులు
2.5 కోట్లమంది ఆధార్ నంబర్లు డీయాక్టివేట్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gaurav Yadav: పంజాబ్ డీజీపీగా గౌరవ్ యాదవ్ నియామకం
Anchor Manjusha | మంజూష అందాల విందు.. చీరకట్టులో మెరిసిపోతున్న యాంకర్!
Ranabaali | యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్!
Power cuts | మెదక్ జిల్లాలో కనీసం ఆరు గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదు : పద్మాదేవేందర్ రెడ్డ
Congress rule | కాంగ్రెస్ పాలనలో మళ్లీ అయిల్ ఇంజన్లు..! కన్నీళ్లతో సాగు చేస్తున్న రైతన్నలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

