కరోనా పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి

కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. గురువారం వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని మధురానగర్ కాలనీ కమ్యూనిటీ హాల్లో కరోనా వ్యాక్సిన్ కేంద్రాన్ని డివిజన్ కార్పొరేటర్ దేదీప్యతో కలిసి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ ముందస్తు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లేవారు, వాహనాల్లో ప్రయాణించే వారు తప్పనిసరిగా మాస్కులు ధరించడంతో పాటు శానిటైజర్‌తో ఎప్పటికప్పుడూ చేతులను శుభ్రం చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. బహిరంగ ప్రదేశాలతో పాటు అన్ని చోట్ల భౌతిక దూరం పాటించాలని కోరారు. వ్యాక్సిన్ పట్ల అపోహలు వీడి కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఈ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. కరోనా నివారణకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని తెలిపారు. కొవిడ్ టీకాను ప్రతి ఒక్కరూ వేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో శ్రీరాంనగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సిబ్బంది, మధురానగర్‌కాలనీ సంక్షేమ సంఘం నాయకులు, సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

