హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

పీర్జాదిగూడ, సెప్టెంబర్14 : హత్య కేసులో నిందితుడికి న్యాయస్థానం జీవిత కాలం జైలు శిక్షతో పాటు జరిమానా విధించినట్లు మేడిపల్లి ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి తెలిపారు. ఒడిస్సా రాష్ట్రం బింజిలీ గ్రామానికి చెందిన ముకుందా రాందారి (33), అదే ప్రాంతానికి చెందిన జయరామ్(23) బతుకు దెరువుకోసం వచ్చి పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలో నివాసముంటూ స్థానికంగా సెంట్రింగ్ పని చేస్తుండేవారు. అయితే 2020 మే నెల 6న రాత్రి స్థానికంగా ఉన్న బుద్దానగర్లో ఓ ప్లాట్‌లో సెంట్రింగ్ పని చేస్తుండగా డబ్బుల విషయంలో వీరిద్దరి మధ్యన గొడవ జరిగింది. అదే సమయంలో రాందారి ఇనుప రాడ్డుతో జయరామ్ తలపై కొట్టాడు. తీవ్రగాయాలపాలైన జయరామ్ ఉస్మానియా దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న మేడిపల్లి పోలీసులు కోర్టులో హాజరు పర్చారు. ఎల్బీనగర్ పదమూడవ మెట్రోపాలిటన్ అదనపు న్యాయస్థానం నిందితుడికి జీవిత కాలం జైలు శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- jail sentence
RELATED ARTICLES
తాజా వార్తలు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

