అంగరంగ వైభవంగా జగన్నాథ రథయాత్ర

కవాడిగూడ, జూలై 12: హరేరామ హరేకృష్ణ రామరామ హరేహరే అంటూ వందలాది భక్తుల నినాదాలలో జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగింది. భక్తజనం రంగురంగుల పూలతో రథయాత్రకు స్వాగతం పలికారు. సోమవారం ఎన్టీఆర్ స్టేడియం వద్ద ప్రత్యేంగా అలంకరించిన వాహనంలో పూర్ణకుంభాన్ని ఉంచి రథయాత్ర నిర్వహించారు. ఎన్టీఆర్ స్టేడియం నుంచి ప్రారంభమై.. ఇందిరాపార్కు చౌరస్తా, అశోక్‌నగర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్, చిక్కడపల్లి, నారాయణగూడ, హిమాయత్‌నగర్, బషీర్‌బాగ్ మీదుగా అబిడ్స్‌లోని ఇస్కాన్ దేవాలయానికి చేరుకుంది. కోలాటాలు, నృత్యాలు, భక్తిగీతాల మధ్య కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులు రథయాత్రలో పాల్గొన్నారు. హైదరాబాద్ టెంపుల్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు వేదాంత చైతన్యదాస్, రాధేశ్యామ్దాస్, వరదాకృష్ణదాస్, సెక్రెటరీ శంభు వైష్ణవ్దాస్ల ఆధ్వర్యంలో రథయాత్ర నిర్వహించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

