బీఎల్వోలు ఇండ్లకెళ్లాల్సిందే
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో శనివారం ఏఈఆర్వోలు, ఆర్డీవోలు, బూత్ స్థాయి అధికారులతో సమీక్షించారు. రోజూవారీగా అందిన ఫారం-18 దరఖాస్తుల వివరాలను గూగుల్ డ్రైవ్ షీట్లో ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయాలని నిర్దేశించారు.
- అక్రమాలకు తావులేకుండా చూడాలి
- అధికారులకు బల్దియా కమిషనర్ ఆదేశాలు
సిటీబ్యూరో, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ) : . ఫారం-18 దరఖాస్తులను రిజిస్టర్లో నమోదు చేసి, సీఈవో కార్యాలయం అందించిన సాఫ్ట్వేర్లో డిజిటలైజ్ చేయాలని సూచించారు.ఆన్లైన్లో అందిన దరఖాస్తులను వాటి డాక్యుమెంట్లతో సహా డౌన్లోడ్ చేసుకుని, క్షేత్రస్థాయి పరిశీలన కోసం రెగ్యులర్ బీఎల్వోలకు అందజేయాలన్నారు.
దరఖాస్తుదారు ఇచ్చిన చిరునామాలో వారు నివసించకపోతేనే ఆ దరఖాస్తులను తిరసరించాలని, కేవలం అవసరమైన ధ్రువీకరణపత్రాలు సమర్పించలేదన్న ఒక కారణంతో దరఖాస్తులను తిరసరించరాదని స్పష్టం చేశారు. బీఎల్వోలే స్వయంగా దరఖాస్తుదారుల ఇండ్లకు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరించాలని సూచించారు. అన్ని అర్హత కలిగిన పట్టభద్రులకు ఓటు హకు కల్పించేలా.. అదే సమయంలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని కర్ణన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ సంతోష్, ఆర్డీఓలు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

