సర్కారు బడిలో ఐసోలేషన్

- సీఐఐ-నాట్కో ట్రస్టు ఆధ్వర్యాన బోరబండలో ఏర్పాటు
- ఐదు గదుల్లో 40 పడకలు
- ఉచితంగా మందులు, భోజనం, ఆక్సిజన్ సౌకర్యం
ఎర్రగడ్డ, మే 25: నగరంలో చాలా కుటుంబాలు చిన్నచిన్న అద్దె గదుల్లో నివాసం ఉంటాయి.. ఈ కుటుంబాల్లో ఎవరికైనా కరోనా పాజిటివ్ వస్తే.. ఆ కుటుంబ సభ్యులతో కాంటాక్ట్ కాకుండా విడిగా హోం క్వారంటైన్లో ఉండటం కష్టం.. అలాగే పేదలు కూడా హోం క్వారంటైన్లో ఉండాలంటే సాధ్యపడదు.. ఇలాంటి వారికి ఉచితంగా ఐసొలేషన్ వసతి కల్పించడానికి నాట్కో ట్రస్టు ముందుకు వచ్చింది. సీఐఐతో కలిసి నాట్కో ట్రస్టు 40 పడకల ఐసొలేషన్ కేంద్రాన్ని బోరబండలో ఏర్పాటు చేసింది. బోరబండ డివిజన్, పెద్దమ్మనగర్లోని నాట్కో ప్రభుత్వ పాఠశాల ప్రైమరీ విభాగం భవనంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని మంగళవారం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, మాజీ డిప్యూటీ మేయర్.. ప్రస్తుత కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్‌తో కలిసి ప్రారంభించారు. బల్దియా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పర్యవేక్షణలో ఈ ఐసొలేషన్ కేంద్రం పని చేస్తుంది. ఈ సందర్భంగా మాగంటి గోపీనాథ్, బాబా ఫసియుద్దీన్ మాట్లాడుతూ.. కొవిడ్ రోగులకు సేవలను అందించడానికి ముందుకు వచ్చిన నాట్కో సంస్థకు ఇక్కడి ప్రజలు రుణపడి ఉంటారన్నారు. కొవిడ్ రోగులకు సేవలను అందించడానికి సిద్ధమైన వైద్యులు, నర్సులు, వలంటీర్లకు సెల్యూట్ అని అన్నారు. కార్యక్రమంలో బల్దియా డిప్యూటీ కమిషనర్ రమేశ్, నాట్కో ట్రస్టు మేనేజర్ రాంబాబు, సీఐఐ ప్రతినిధి సుభ్జిత్, డాక్టర్ జువేరియాబేగం, డాక్టర్ సుమయ్య, టీఆర్ఎస్ నేతలు కృష్ణమోహన్, విజయ్‌కుమార్, లక్ష్మణ్‌గౌడ్, ఏడీ మధు, రమేశ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఐసొలేషన్ కేంద్రం ప్రత్యేకతలు..
- కొవిడ్ పాజిటివ్ రిపోర్టు, ఆధార్ కార్డు తీసుకెళ్తే.. ఈ కేంద్రంలో బెడ్‌ను కేటాయిస్తారు.
- నాట్కో సర్కారు బడిలోని 5 గదుల్లో 40 మంచాలను ఐసొలేషన్‌కు కేటాయించారు.
- 24 గంటలు వైద్యులు, వలంటీర్లు అందుబాటులో ఉంటారు.
- కొవిడ్ చికిత్సకు అవసరమైన మందులను ఉచితంగా అందజేస్తారు.
- ఎవరికైనా ఆక్సిజన్ అవసరమైతే.. వెంటనే అమర్చుతారు.
- ఐసొలేషన్ సెంటర్లోకి స్వచ్ఛమైన గాలి, వెలుతురు ప్రవేశించేలా ఏర్పాట్లు.
- కొవిడ్ రోగులకు వసతితో పాటు భోజన సౌకర్యాన్ని నాట్కో సంస్థ ఉచితంగా కల్పిస్తుంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

