ఉస్మానియా యూనివర్సిటీ, మే 19 : ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోని దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ మహిళా సభ (డీడీఎంఎస్) లిటరసీ హౌజ్‌లో వివిధ సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ సర్టిఫికెట్ కోర్సులైన బ్యూటీషియన్, ఎంఎస్ ఆఫీస్ – ఇంటర్నెట్, ట్యాలీ – ఈఆర్పీ 9, ట్యాక్సేషన్, యోగా, ఇతర కోర్సులైన టైలరింగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, మగ్గం వర్క్, జూట్ బ్యాగ్ మేకింగ్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, సీ లాంగ్వేజ్, మెహందీ డిజైనింగ్, హెయిర్ స్టైలిస్ట్ తదితర కోర్సులను అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కోర్సులలో చేరేందుకు ఆసక్తి ఉన్న వారు ఈ నెల 31వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఈ కోర్సులు విద్యార్థులు, నిరుద్యోగ యువత, గృహిణిలకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. సీట్లు పరిమితమని, ముందు వచ్చిన వారికి ప్రథమ ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తామన్నారు. ఇతర వివరాలకు 8498080599, 7013457432, 7780537795 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.