సిటీబ్యూరో, ఏప్రిల్ 21(నమస్తే తెలంగాణ): విదేశాల్లో లీజు, కిరాయిలకు సంబంధించిన వ్యాపారంపై పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు సంపాదించవచ్చు అంటూ సైబర్‌నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరలేపారు. సాధారణంగా రెంట్, లీజ్‌లకు సంబంధించిన ప్రాపర్టీల వివరాలు ఇవ్వడం, తీసుకోవడానికి ప్రజలకు సౌకర్యార్థంగా ఉండేలా చాలా వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి పేరున వబ్సుట్లైను ఎరగావేసి ఉన్నత స్థానాల్లో ఉన్న వారిని సైతం ఈజీగా సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టిస్తున్నారు.
ఈ సైబర్నేరగాళ్లబారిన పడి బ్యాంకు ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు, తదితరులు లక్షల్లో పోగొట్టుకుంటున్నారు. ఇందులో భాగంగానే.. ఇటీవల గుర్రంగూడకు చెందిన ఓ ఉద్యోగి వాట్సాప్‌కు వచ్చిన మెసేజ్‌కు స్పందించాడు. ఆన్లైన్ జాబ్స్ మొబైల్ నుంచి చేసుకోవచ్చు అని ఉన్నది. దీన్ని పరిశీలిస్తుండగానే .. ఈరా అనే పేరుతో ఓ మహిళ ఫోన్ చేసింది.. తాను గ్లోబలైజేషన్ పార్టనర్స్ కంపెనీలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నాను.. మీ వివరాలు అమెరికాలోని రెంట్ డాట్ కంపెనీ సిబ్బందికి ఇచ్చామని, వాళ్లు మీతో మాట్లాడుతారంటూ ఫోన్‌చేసి చెప్పింది.
ఆతర్వాత అనామిక పేరుతో యువతి.. తాను రెంట్ డాట్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నానని.. తమ సంస్థ వబ్సుటై స్టూడియోస్ రెంట్ డాట్ కాం విదేశీ ఆస్తులను గుర్తించి.. కావాల్సినవారికి అందజేస్తుందని, ఈ వ్యాపారంలో పెట్టుబడి పెడితే రోజుకు మంచి లాభాలు సంపాదించవచ్చని సూచించింది. వెంటనే బాధితుడు దీనిపై ఇంటర్నెట్లో ఆరా తీయగా.. రెంట్ డాట్ కాం అనే సంస్థ పేరు ఉండడంతో నిజమని నమ్మి .. మొదట పదివేల రూపాయలు పెట్టుబడి పెట్టగా.. రూ.15,200 లాభం అంటూ వచ్చింది. ఆ తర్వాత రూ.21000 పెట్టగా రూ.41000 లు, రూ. 30000పెట్టగా రూ. 44,800 లాభంగా సైబర్ నేరగాళ్లు పంపించారు.
ఇదం తా నిజం అని నమ్మిన బాధితుడు రెండు లక్షల రూపాయలు తన భార్య ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు చూపించిన ఖాతాకు బదిలీ చేశాడు. అయితే మరుసటి రోజు మీ వాలెట్లో నెగిటివ్ బ్యాలెన్స్ రూ. 3,59,000 ఉందని, మీరు వెంటనే వాలెట్ రీచార్జి చేయాలంటూ సూచించారు. ఆలోచిస్తుండగానే రూ. 6. 50 లక్షలు వాలెట్ నెగిటివ్‌లోకి వెళ్ళిందని మళ్లీ ఫోన్ వచ్చింది. మళ్లీ ఆలస్యం చేయడంతో రూ.13.6 లక్షలు నెగిటివ్ బ్యాలెన్స్ లోకి వెళ్ళింది.
వాలెట్‌ను పూర్తిగా నింపితే మీరు రూ. 44 లక్షలు ైక్లెమ్ చేసుకునే వీలుందని సైబర్ నేరగాళ్లు సూచించారు. అప్పటికే రూ11.72 లక్షలు పెట్టుబడిగా పెట్టిన బాధితుడికి, నేరగాళ్లు చెప్పే విషయంపై అనుమానం వచ్చింది. దీనిపై పూర్తిగా ఆరా తీయగా ఇదంతా ఫేక్ అని తెలిసింది. ఈ విషయంపై బాధితుడు రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.