Home
Hyderabad
Identify The Godowns That Are Responsible For The Stench Of Waste Chemicals Coming From The Industrial Area Of Autonagar
అక్రమ డంపింగ్‌ను అరికట్టేందుకు..
ఆటోనగర్ పారిశ్రామిక వాడ నుంచి వస్తున్న వ్యర్థ రసాయనాల దుర్వాసనకు కారణమైన గోడౌన్లను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు.
- చర్యలు తీసుకుంటాం : ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
మన్సూరాబాద్, డిసెంబర్ 17: ఆటోనగర్ పారిశ్రామిక వాడ నుంచి వస్తున్న వ్యర్థ రసాయనాల దుర్వాసనకు కారణమైన గోడౌన్లను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. ఆటోనగర్ వ్యర్థ రసాయనాల డంపింగ్‌ను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై శనివారం సనత్‌నగర్‌లోని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చీఫ్ ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ రఘుతో సమావేశమై సమస్య తీవ్రతను వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆటోనగర్ పారిశ్రామిక వాడలోని కెమికల్, ఫర్టిలైజర్స్ గోడౌన్స్తో పాటు మెకానికల్ షెడ్లలోనూ తనిఖీలు నిర్వహించాలన్నారు. ఆరు నెలలుగా ఆటోనగర్ పారిశ్రామిక వాడ నుంచి వస్తున్న వ్యర్థ రసాయనాల వాసనతో ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారని తెలిపారు. ఆరోగ్యాలను కాపాడుకునేందుకు కొందరు తమ సొంత ఇండ్లను ఖాళీ చేసి వెళ్లి పోతున్నారని.. ఇంతటి దుస్థితికి కారణమైన వ్యక్తులను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. భూ వాతావరణ కాలుష్యానికి కారకులైన వారిని చట్టం ముందు నిలబెట్టేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు.
కేబీఆర్ ఫంక్షన్ హాల్ నుంచి ఆటోనగర్ డంపింగ్ యార్డుకు వెళ్లే మార్గంలో రోడ్లకు ఇరువైవులా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పురాతన భవనాల శిథిలాలతో పాటు చెత్తా చెదారాన్ని వేస్తున్నారని వారిపై నిఘాపెట్టి జరిమానా విధింపజేస్తానని తెలిపారు. వ్యర్థ రసాయనాలను ఆటోనగర్ పారిశ్రామిక వాడతో పాటు పరిసరాల్లో ఉన్న చెరువుల్లోనూ డంప్ చేసి కలుషితం చేస్తున్నట్లు తెలిపారు. రసాయన వ్యర్థాల డంపింగ్‌కు పాల్పడుతున్న వ్యక్తులతో పాటు వారికి సహకరిస్తున్న వారి బండారం బయటపెడుతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు ప్రొఫెసర్లు బాలనర్సయ్య, గోపాల్, టీఎస్ఐఐసీ సీజీఎం వినోద్‌కుమార్, జీహెచ్ఎంసీ సీఎస్ఈ అశోక్‌రెడ్డి, ఏఎంహెచ్‌వో డాక్టర్ శ్రీనివాస్, కాలనీల ప్రతినిధులు మార్గం రాజేశ్, వల్లూరిపల్లి పార్థసారథి, అంజయ్య గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

