ఖేలో ఇండియాకు ఇద్దరు సైక్లిస్టుల ఎంపిక

ఉస్మానియా యూనివర్సిటీలోని వెలోడ్రమ్ (సైక్లింగ్) స్టేడియంలో జరుగుతున్న 72వ జాతీయ ట్రాక్ సైక్లింగ్ చాంపియన్‌షిప్ – 2021 పోటీలు కొనసాగుతున్నాయి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ (సాట్స్), సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో సోమవారం పాల్గొన్న ఇద్దరు సైక్లిస్ట్‌లు ఖేలో ఇండియా కార్యక్రమానికి ఎంపికయ్యారు. సైక్లింగ్ రైడర్స్ అండర్-14 విభాగంలో ఎంపికైన ఇద్దరూ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు కావడం విశేషం. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు చెందిన ఈ ఇద్దరూ పోటీల్లో తెలంగాణ తరపున పాల్గొన్నారు. సీనియర్ కోచ్ దిలీప్, కోచ్ అల్లాడి కృష్ణ యాదవ్ పర్యవేక్షణలో సిద్ధమైన ఈ ఇద్దరి ప్రతిభ చూసిన నిర్వాహకులు వారిని ఖేలో ఇండియాకు ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పథకం కింద వారికి కేంద్ర ప్రభుత్వ నిధులతో అత్యుత్తమమైన శిక్షణ అందించడంతో పాటు, వారికి స్కాలర్షిప్స్ సైతం అందజేయనున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- cyclists
- khelo india
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

